తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాలింతను ఈడ్చుకెళ్లిన ఆశ్రమ నిర్వాహకులు - Barwani Kanya Ashram

ఛత్తీస్​గఢ్​లో అమానుష ఘటన చోటుచేసుకుంది. కొరియా జిల్లా బర్వానీ కన్యా ఆశ్రమంలో తలదాచుకునేందుకు వచ్చిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలిపై అనుచితంగా ప్రవర్తించాడు అక్కడి మహిళా సూపరింటెండెంట్​ భర్త. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.

బాలింతను ఈడ్చుకెళ్లిన ఆశ్రమ నిర్వాహకులు

By

Published : Aug 19, 2019, 1:42 PM IST

Updated : Sep 27, 2019, 12:34 PM IST

బాలింతపై ఆశ్రమ నిర్వాహకుల దౌర్జన్యం

ఓ పారిశుద్ధ్య కార్మికురాలి పట్ల దారుణంగా ప్రవర్తించారు ఆశ్రమ నిర్వాహకులు. ఛత్తీస్​గఢ్​ కొరియా జిల్లా.. బర్వానీ కన్యా ఆశ్రమంలో చోటుచేసుకుందీ ఘటన. 3 నెలల క్రితం శిశువుకు జన్మనిచ్చిన ఆ మహిళ... విద్యార్థులు ఉంటున్న వసతి గృహంలో ఆశ్రయం ఉంటోంది.

ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఆశ్రమ సూపరింటెండెంట్​ సుమిలా సింగ్​, ఆమె భర్త... ఆ బాలింతపై దాడి చేశారు. అత్యంత అమానుషంగా అమాంతం మంచంపై నుంచి లాగి.. కింద పడేశాడా కర్కశుడు. ఇద్దరూ కలిసి ఆమెను గది నుంచి బయటకు ఈడ్చుకెళ్లారు. ఆమె సామగ్రిని రోడ్డుపై పడేశాడు.

ఇదీ చూడండి:ఉప్పులో ఉంచితే చనిపోయినా లేచొస్తారా...?

ఈ వీడియో క్షణల్లో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. స్పందించిన పోలీసులు.. ఆశ్రమ నిర్వాహకులైన సుమిలా సింగ్​, ఆమె భర్తపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి.. దర్యాప్తు చేపడుతున్నారు.

Last Updated : Sep 27, 2019, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details