ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన సరఫరాపై కేంద్ర హోంమంత్రి అమిత్షా సమీక్ష చేశారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖమంత్రి ఎస్ జైశంకర్, వాణిజ్య, రైల్వే శాఖమంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
పెట్రో ధరలపై కేంద్ర మంత్రుల సమీక్ష - review
హోంమంత్రి అమిత్షా మంత్రివర్గ సహచరులతో భేటీ అయ్యారు. ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన సరఫరాపై కేబినెట్ మంత్రులు చర్చించారని సమాచారం.
ఇంధన సరఫరాపై అమిత్షా సమీక్ష
ఆర్థిక, పెట్రోలియం శాఖ అధికారులు, నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అమితాబ్ కాంత్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Last Updated : Jun 4, 2019, 6:00 PM IST