రెండు రోజుల పాటు జమ్ముకశ్మీర్‌లో పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇందులో భాగంగా నేటి మధ్యాహ్నం 1.30 గంటలకు దిల్లీ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు.
జమ్ముకశ్మీర్‌కు హోంమంత్రి అమిత్ షా - హోంమంత్రి
రెండు రోజుల పర్యటన కోసం నేటి మధ్యాహ్నం జమ్ముకశ్మీర్‌కు వెళ్లనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సరిహద్దుల్లో పరిస్థితులతో పాటు అమర్‌నాథ్ యాత్ర భద్రతపై సమీక్షించనున్నారు.
జమ్ముకశ్మీర్‌కు హోంమంత్రి అమిత్ షా
మధ్యాహ్నం 3.30 గంటలకు అధికారులతో సమావేశమవుతారు. అమర్‌నాథ్ యాత్ర భద్రత, అభివృద్ధి కార్యక్రమాల అమలు, సరిహద్దుల్లో పరిస్థితి, అంతర్గత భద్రతపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం... ఇటీవల మరణించిన పోలీసు అధికారులు, భాజపా కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు షా.