కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన నాలుగో విడత లాక్డౌన్ మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఇంకా పొడిగించాలా? వద్దా? అనే విషయంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడారు హోంమంత్రి అమిత్ షా. ఈ విషయంపై అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.
లాక్డౌన్ పొడిగించాలా? వద్దా?.. సీఎంలతో షా చర్చ! - home minister amit shah latest news
లాక్డౌన్ పొడిగింపు అంశంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో సంభాషించారు హోంమంత్రి అమిత్ షా. ఈ విషయంపై తమతమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు.
లాక్డౌన్ పొడిగింపు అంశంపై సీఎంలతో షా చర్చ
అని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి లాక్డౌన్ పొడిగింపు విషయమై హొంమంత్రి సలహాలు, సూచనలు కోరినట్లు అధికారులు తెలిపారు.
కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా మార్చి 25న తొలిసారి లాక్డౌన్ ప్రకటించింది కేంద్రం. ఆ తర్వాత నాలుగు సార్లు పొడిగించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగో విడత లాక్డౌన్ మే 31తో ముగియనుంది. లాక్డౌన్ 5.0పై మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.