జమ్ముకశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు అమర్నాథ్ యాత్రికులను వెనుదిరగాలని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
తాజాగా భద్రతాపరమైన హెచ్చరికలతో కశ్మీర్లో ఆందోళన నెలకొంది. శ్రీనగర్ ఎన్ఐటీకి నిరవధిక సెలవులు ప్రకటించింది యాజమాన్యం. ఇతర రాష్ట్రాల విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని సూచించింది. తదుపరి ఆదేశాలు అందేవరకు తరగతులు ఉండవని ప్రకటించింది ఎన్ఐటీ. ఇందుకోసం జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది.
పాఠశాలలు మూసివేత?
కశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలు మూసివేస్తున్నట్టు వార్తలు వ్యాపించాయి. అయితే ఈ వార్తలు అవాస్తవమని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటిచింది. పాఠశాలల మూసివేతపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేసింది.