చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఉల్లాసంగా జరుపుకునే రంగుల పండుగ 'హోలీ.' వివిధ రకాల రంగులతో సంబరాలు జరుపుకుంటారు.
దిల్లీ ఘాజియాబాద్‌లో హోలీ పండుగ సందడి ముందుగానే మొదలైంది. మార్కెట్లన్నీ ఇంద్రధనస్సును తలపిస్తున్నాయి. రంగులు కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలతో దుకాణాలన్నీ కళకళలాడుతున్నాయి.
రంగులు తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దాదాపు మార్కెట్లలో లభించే రంగులన్నీ కృత్రిమంగా తయారు చేసినవేనని, ఇవి ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు. అందువల్ల సహజసిద్ధమైన రంగులనే వాడాలని సూచిస్తున్నారు. కృత్రిమ రంగులు చూడగానే గుర్తుపట్టవచ్చు. అవి చూసేందుకు ఆకర్షణీయ రంగుల్లో ఉంటాయి.