తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రంగుల సంబరం... యావద్భారతం సప్తవర్ణశోభితం - Holi

హోలీ పర్వదినాన దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. దిల్లీ, ముంబయి సహా అన్ని ప్రధాన నగరాల్లో హోలీ పండుగను ఆహ్లాదంగా జరుపుకుంటున్నారు ప్రజలు.

ఘనంగా హోలీ

By

Published : Mar 21, 2019, 12:02 PM IST

ఘనంగా హోలీ
దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడు నడయాడిన మథుర జిల్లాలోని బృందావనంలో సందడి వాతావరణం నెలకొంది. బంకే బిహారీ ఆలయానికి ఉదయాన్నే పెద్ద సంఖ్యలో చేరుకున్న ప్రజలు ఎంతో ఉత్సాహంగా హోలీ వేడుకలు జరపుకున్నారు.

సహజసిద్ధ రంగులతో....

ముంబైలోని ప్రియదర్శిని పార్కులో సహజసిద్ధ రంగులతో హోలీ సంబరాలు చేసుకున్నారు. పర్యావరణ హితంగా సంబరాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.

ఆరెస్సెస్​ హోలీ వేడుకల్లో యోగి

ఉత్తరప్రదేశ్​లోని గోరఖ్​పూర్​ ఆరెస్సెస్​ కేంద్రాలయంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరెస్సెస్​ నాయకులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు.

దిల్లీ, అహ్మదాబాద్​, వారణాసి, ఉజ్జయిని, కులు, ఔరంగాబాద్​, సూరత్​, లూథియానా, గువహటి, ఛత్తీస్​గఢ నగరాల్లో హోలీ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details