తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​లో నాయకత్వ సంక్షోభం కొత్తేమీ కాదు! - రాహుల్​ గాంధీ

కాంగ్రెస్​ పార్టీ 135 ఏళ్ల చరిత్రలో అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వ సంక్షోభాలు వంటివి ఎన్నో ఉన్నాయి. నెహ్రూ, పటేల్ దగ్గర నుంచి గాంధీయేతర నాయకులైన పీవీ నర్సింహారావు వరకు ఎంతోమందికి అసంతృప్తి జ్వాలలు ఎదురయ్యాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితే కనిపిస్తోంది.

History of  Leadership crisis in Congress Party
కాంగ్రెస్​లో నాయకత్వ సంక్షోభం రావడం కొత్తేమి కాదు!

By

Published : Aug 24, 2020, 6:19 PM IST

నాలుగు దశాబ్దాలకుపైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్​ పార్టీకి అంతర్గత కుమ్ములాటలు కొత్తేమీ కాదు. బేధాభిప్రాయాలు వివాదాలుగా మారి... పార్టీ నిట్టనిలువునా చీలిపోయిన సందర్భాలూ ఉన్నాయి.

సోనియా అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు

  • 1999 లోక్​సభ ఎన్నికలకు ముందు శరద్​ పవార్​, పీఏ సంగ్మా, తారిఖ్​ అన్వర్​ తిరుగుబాటు చేశారు. వారిని పార్టీ నుంచి తొలగించారు.
  • 2001లో కాంగ్రెస్​ అధ్యక్ష పదవి సోనియాపై పోటీకి దిగారు దివంగత నేత జితేంద్ర ప్రసాద. సోనియా విజయం సాధించారు.

సీతారామ్​ కేసరికి వ్యతిరేకంగా

1998లో కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సీతారామ్​ కేసరిపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అయితే సోనియానే పార్టీ పగ్గాలు చేపట్టాలని ఆమె విధేయులే గాంధీయేతర కుటుంబానికి చెందిన కేసరికి వ్యతిరేకంగా పనిచేయడం గమనార్హం.

పీవీ నర్సింహారావుకు వ్యతిరేకంగా

1990లో మరోసారి పార్టీలో అసమ్మతి బయటపడింది. గాంధీయేతర నాయకుడైన మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుపై కొంతమంది నాయకులు తిరుగుబాటు చేశారు. ఫలితంగా ఎన్​డీ తివారి, అర్జున్​ సింగ్​ కాంగ్రెస్​ నుంచి విడిపోయి కొత్త పార్టీ పెట్టారు.

రాజీవ్​గాంధీకి వ్యతిరేకంగా

  • 1987లో రాజీవ్​గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడూ సంక్షోభం ఎదురైంది. రాజీవ్​ కేబినెట్​లో ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రిగా వ్యవహరించిన వీపీ సింగ్ ప్రభుత్వంలోని అవినీతిపై గళం విప్పారు. ఆ పరిణామంతో వీపీ సింగ్​ను తొలుత మంత్రి పదవి నుంచి, ఆ తర్వాత పార్టీ నుంచి తొలగించారు.
  • కాంగ్రెస్​ నుంచి బయటకు వచ్చిన వీపీ సింగ్​ కొంతమంది కాంగ్రెస్​ అసంతృప్త నాయకులతో కలిసి జన్​ మోర్చా పార్టీని ప్రారంభించారు.

ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా

  • 1969లో రాష్ట్రపతి ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి అయిన వీవీ గిరికి ఇందిరా గాంధీ మద్దతు తెలిపిన కారణంగా పార్టీలోని సీనియర్ నేతలు ఆమెపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
  • కాంగ్రెస్​ పార్టీ అధికారిక అభ్యర్థి నీలం సంజీవరెడ్డి ఓడిపోయారు. అప్పటి కాంగ్రెస్​ అధ్యక్షుడు ఎస్​ నిజలింగప్ప.. ఇందిరా గాంధీని బహిష్కరించిన తర్వాత పార్టీ రెండుగా చీలిపోయింది.
  • దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ పరాజయాన్ని చవిచూసింది. దీంతో మరోసారి పార్టీలో సంక్షోభం తలెత్తింది. అప్పటి కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడైన కె.బ్రహ్మానందరెడ్డి, మరో నేత వైబీ చవాన్​ ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.
  • 1977 ఎన్నికల ముందు పార్టీలో చీలికలు ఏర్పడిన తర్వాత జగ్జీవన్​ రామ్​.. హెచ్​ ఎన్ బహుగుణతో కలిసి కాంగ్రెస్​ ఫర్​ డెమొక్రసీ పార్టీని స్థాపించారు.

నెహ్రూకు వ్యతిరేకంగా

  • పురుషోత్తమ్​ దాస్​ టాండన్​, కేఎమ్​ మున్షి, నర్​హర్​ విష్ణు గాడ్గిల్​ వంటి నాయకులతో జవహర్​లాల్​ నెహ్రూ సమస్యలను ఎదుర్కొన్నారు.
  • 1950లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో పార్టీకి అధ్యక్షుడిగా పోటీ చేయాలన్న తన నిర్ణయాన్ని టాండన్​ ప్రకటించారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు అవి.
  • 1951 జులైలో సీడబ్ల్యూసీకి నెహ్రూ రాజీనామా చేసినప్పుడు మళ్లీ సంక్షోభం తలెత్తింది. మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన ఏడాది తర్వాత టాండన్​ రాజీనామా చేశారు. అదే ఏడాది అక్టోబరులో దిల్లీ వేదికగా జరిగిన ఏఐసీసీ సమావేశంలో నెహ్రూ కాంగ్రెస్​ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

కాంగ్రెస్​కు 'గాంధీయేతర' సారథులు వీరే..

  1. జేబీ కృప్లానీ (1947) -మహాత్మా గాంధీకి అనుచరునిగా ఉన్న కృప్లానీ 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్​ పార్టీకి మొదటి అధ్యక్షునిగా వ్యవహరించారు. జవహర్​లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి అయ్యారు.
  2. పట్టాభి సీతారామయ్య (1948-49)-రెండేళ్లు కాంగ్రెస్​ అధ్యక్షుడిగా పనిచేశారు. ఎన్నికలకు దూరంగా ఉన్నారు. పార్టీ అధ్యక్షునిగా పదవీకాలం ముగిసిన తర్వాత 1952-1957 మధ్య కాలంలో మధ్యప్రదేశ్​కు గవర్నర్​గా పనిచేశారు.
  3. పురుషోత్తమ్​ దాస్​ టాండన్​ (1950) -స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ, పటేల్​ మధ్య జరిగిన ఆధిపత్య పోరుకు ఈ ఎన్నిక ఓ నిదర్శనం. అధ్యక్ష పదవికి పురుషోత్తమ్​​ను నెహ్రూ తిరస్కరించినప్పటికీ పటేల్​ మద్దతుతో పార్టీ పగ్గాలు చేపట్టారు దాస్.
  4. యూఎన్​ దేబర్​ (1955-59) - వరుసగా మూడేళ్లపాటు కాంగ్రెస్​ పార్టీకి అధ్యక్షుడి పదవితో పాటు ప్రధానమంత్రిగానూ జవహర్​లాల్​ నెహ్రూ కొనసాగారు. ఆ తర్వాత 1955లో యూఎన్​ దేబర్​ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అవధి, అమృత్​సర్​, ఇండోర్​, గువహటి, నాగ్​పుర్​లో జరిగిన పార్టీ సమావేశాలకు ఈయనే అధ్యక్షత వహించారు.
  5. నీలం సంజీవరెడ్డి (1960-63) - కాంగ్రెస్​ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికైన అతిపిన్న వయస్కుడు నీలం సంజీవరెడ్డి. 1960 నుంచి వరుసగా మూడేళ్ల పాటు అధ్యక్షునిగా వ్యవహరించడం సహా దేశానికి ఆరవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  6. కుమారస్వామి కామరాజ్​ (1964-67) - కాంగ్రెస్​ అత్యంత గడ్డు పరిస్థితిలో ఉన్నప్పుడు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు కామరాజ్​. ఆయన ఎన్నికైన కొన్నేళ్లు ప్రశాంతంగా గడిచినా ఆ తర్వాత పార్టీలో ఒడుదుడుకులు ఎదురయ్యాయి. ప్రధానంగా చైనాపై యుద్ధంలో ఓటమి చెందడం వల్ల పరిస్థితి తీవ్రంగా మారింది. పార్టీలోని సీనియర్ల సూచన మేరకు ఆయన చేపట్టిన మంత్రి పదవిని వదిలేసి పార్టీ కార్యకలపాలను చూసుకున్నారు. దీన్ని కామరాజ్​ ప్లాన్​ అని అభివర్ణించారు. కామరాజ్​ పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడే నెహ్రూ మరణించారు. నెహ్రూ తర్వాత ప్రధానిని ఎవరిని నియమిస్తారనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే అప్పటి పార్లమెంట్​ సభ్యులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సలహా మేరకు లాల్​బహదూర్​ శాస్త్రిని ప్రధానమంత్రిగా నియమించారు కామరాజ్​.
  7. ఎస్​.నిజలింగప్ప (1968-69) - కామరాజ్​ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు నిజలింగప్ప. ఇందిరా గాంధీ పార్టీలో అధికారం మొత్తాన్ని కేంద్రీకృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. కాంగ్రెస్​ పార్టీని రెండుగా చీలడానికి నిజలింగప్ప ఓ విధంగా కారణమయ్యారు.
  8. జగ్జీవన్​ రామ్​ (1970-71) -కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిన తర్వాత ఇందిరా గాంధీ వర్గం జగజ్జీవన్​ రామ్​ను అధ్యక్షునిగా ఎన్నుకుంది. 1972 వరకు పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగినా.. ఇందిరా గాంధీనే అసలు అధికారాన్ని చలాయించారు.
  9. శంకర్​ దయాళ్​ శర్మ (1972-74) -జగ్జీవన్ రామ్​ తర్వాత ఇందిరా గాంధీకి సన్నిహితుడైన శంకర్​ దయాళ్​ శర్మ కాంగ్రెస్​ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1975-77 మధ్య అత్యవసర పరిస్థితిలో కేంద్ర కమ్యూనికేషన్​ మంత్రిగా పనిచేశారు. దేశానికి తొమ్మిదవ రాష్ట్రపతిగానూ ఎన్నికయ్యారు.
  10. దేవ్​కాంత్​ బరూహ (1975-77) -భారత ప్రజాస్వామ్యంలో చీకటి కాలమైన 1975-77 మధ్య కాంగ్రెస్​ పార్టీకి అధ్యక్షునిగా వ్యవహరించారు దేవ్​కాంత్​. పార్టీపై గాంధీ కుటుంబానికి ఉన్న అధికారాన్ని వ్యక్తపరుస్తూ.. ఇందిర అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిర అనే నినాదంతో గుర్తింపు పొందారు.
  11. పీవీ నర్సింహారావు (1992-96) -ఈయన పదవీకాలంలో గాంధీ కుటుంబసభ్యులు ఎవరూ పార్టీలో ప్రముఖంగా లేరు. వీపీ సింగ్​ ప్రభుత్వ పతనం తర్వాత ప్రధానమంత్రిగా, పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు పీవీ. ఆ సమయంలో నర్సింహారావు విరోధులు సోనియా గాంధీని రాజకీయాల్లోకి అహ్వానించారు.
  12. సీతారామ్​ కేసరి (1996-98) -పీవీ నర్సింహారావు తర్వాత పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టారు సీతారామ్​. ఈయన హయంలో 1997లో ఆరు నెలల వ్యవధిలోనే రెండు కేంద్ర ప్రభుత్వాలు పడిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details