హిమాచల్ ప్రదేశ్ సోలన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని కుమరహట్టీలో ఓ భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 18 మంది సైనికులు, ఐదుగురు స్థానికులను విపత్తు నిర్వహణ సిబ్బంది రక్షించారు.
భవనం కూలి ఇద్దరు మృతి- 10మందికిపైగా గల్లంతు
హిమాచల్‌ప్రదేశ్ సోలన్ జిల్లాలో 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఓ భవనం కుప్పకూలింది. ఇద్దరు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న 23 మందిని విపత్తు నిర్వహణ సిబ్బంది రక్షించారు. మిగిలిన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
కూలిన భవనం.. శిథిలాల కింద 25 మంది
ప్రమాద సమయంలో అక్కడ 30 మంది జవాన్లు, ఏడుగురు స్థానికులు ఉన్నారు. ఇంకా శిథిలాల కింద 10 మందికి పైగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వారిని సురక్షితంగా వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చూడండి: కర్తార్పుర్పై రాజీ- భద్రతే ప్రధానంగా భారత్ వా
ణి
Last Updated : Jul 14, 2019, 7:25 PM IST