ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉదయం దిల్లీలోని ఎర్రకోటపై జెండా ఎగరవేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.
73వ స్వాతంత్ర్య వేడుకల కోసం తొలిసారిగా ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ నిక్షిప్తం చేసిన కెమెరాలను వినియోగించనున్నారు అధికారులు. గగనతల భద్రతకోసం యాంటీ డ్రోన్ డిటెక్షన్ వ్యవస్థను సిద్ధం చేశారు. ఎర్రకోట ప్రాంగణం, మంత్రులు, ప్రజలు కూర్చునే ప్రదేశాల్లో దాదాపు 500 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సైన్యం, పారామిలిటరీ దళాలు, 20వేల దిల్లీ పోలీసులను ఎర్రకోట వద్ద మోహరించారు. పరిసరాల్లోని రోడ్లన్నీ సీసీ కెమెరాల నిఘాలో ఉండనున్నాయి.
పంద్రాగస్టు వేడుకలకు దిల్లీలో అసాధారణ భద్రత - మోదీ
73వ స్వాతంత్ర్య వేడుకల కోసం దిల్లీలోని ఎర్రకోట వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. సైన్యం, పారామిలిటరీ దళాలు, దిల్లీ పోలీసులు గురువారం విధులు నిర్వర్తించనున్నారు. ఈ వేడుకలకు తొలిసారిగా ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ నిక్షిప్తం చేసిన కెమెరాలను వినియోగించనున్నారు.
పంద్రాగస్టు వేడుకలకు దిల్లీలో అసాధారణ భద్రత
జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో స్వాట్, ఎన్ఎస్జీ స్నైపర్లను ఇప్పటికే దిల్లీకి తరలించారు.
ఇదీ చూడండి:- తలపై కొబ్బరికాయలు కొట్టించుకుని మొక్కులు
Last Updated : Sep 27, 2019, 12:43 AM IST