తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డబ్బు కాదు టీపొడే... తమిళనాట హైడ్రామా - తమిళనాడు

తమిళనాడు కోయంబత్తూర్​లో మంగళవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల వేళ అక్రమ నగదు తరలిస్తోందన్న వదంతులతో ఓ కంటెయినర్​ లారీని స్థానికులు అడ్డగించారు. తీరా చూస్తే అందులో టీ పొడి​ ఉందని తేలింది. అసత్య వార్తలు వ్యాప్తించారన్న ఆరోపణలతో నటుడు కమల్​హాసన్​ పార్టీ మక్కల్​ నీది మయ్యం సభ్యుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

అక్రమ నగదు కాదు... టీ పౌడరే..!

By

Published : Apr 10, 2019, 7:10 AM IST

Updated : Apr 10, 2019, 7:42 AM IST

అక్రమ నగదు కాదు... టీ పొడే!

దేశంలో సాధారణ ఎన్నికల వేళ అక్రమ నగదు తరలింపు వదంతులు పోలీసులకు తలనొప్పిగా మారుతున్నాయి. ఇలాంటి ఘటనే తమిళనాడు కోయంబత్తూర్​లో జరిగింది. అక్రమ నగదు తరలింపుపై వదంతులు వ్యాప్తి చెందటం వల్ల ఓ కంటెయినర్​ను అడ్డగించారు స్థానికులు. కానీ అందులో ఉన్నది టీ పొడేనని చివరకు తేలింది.

జరిగిందేమిటి?

అక్రమంగా నగదు తరలిస్తున్నారన్న వదంతులతో కోయంబత్తూర్​లో ఓ కంటెయినర్ లారీ​ని స్థానికులు అడ్డుకున్నారు. కంటెయినర్​ను తెరిచేందుకు ప్రయత్నించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ట్రక్​ను జిల్లా పాలనాధికారి కార్యాలయానికి తరలించి ఎన్నికల సంఘం అధికారులకు సమాచారం అందించారు.

ఎన్నికల అధికారులు అక్కడికి చేరుకుని కంటెయినర్​ను తనిఖీ చేశారు. అందులో ఎలాంటి నగదు లభించలేదని, సుమారు రూ.30 లక్షల విలువైన టీ పొడి​ ఉన్నట్లు స్పష్టంచేశారు. జిల్లా పాలనాధికారి కార్యాలయానికి చేరుకున్న టీ పొడి​ యజమానులు సంబంధిత పత్రాలను సమర్పించారు. టీ పొడిని కొచ్చి పోర్టుకు తరలించి... అక్కడి నుంచి స్పెయిన్​కు ఎగుమతి చేస్తున్నట్టు తెలిపారు.

వదంతులు వ్యాప్తి చేశారన్న ఆరోపణలతో నటుడు కమల్​ హాసన్​ మక్కళ్​ నీది మయ్యం పార్టీకి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

2016 తమిళనాడు శాసనసభ ఎన్నికల సమయంలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. రూ. 570కోట్ల నగదును అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో మూడు ట్రక్కులను అధికారులు జప్తు చేశారు. చివరకు ఆ నగదు ఎస్​బీఐ బ్యాంకుదని తేలింది.

Last Updated : Apr 10, 2019, 7:42 AM IST

ABOUT THE AUTHOR

...view details