తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాట పాడేందుకు నిరాకరించాడని వివాహిత ఆత్మహత్య..! - స్నేహితుడు పాట పాడెందుకు అంగీకరించలేదని మహిళ ఆత్మహత్య

ఆన్​లైన్​ సింగింగ్ యాప్​లో స్నేహితుడు తనతో పాట పాడేందుకు అంగీకరించలేదనే మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది బెంగళూరుకు చెందిన ఓ వివాహిత. ఆమెకు ఇద్దరు కుమారులున్నారు.

పాట పాడేందుకు నిరాకరించాడని మహిళ ఆత్మహత్య

By

Published : Sep 28, 2019, 8:20 PM IST

Updated : Oct 2, 2019, 9:28 AM IST

కర్ణాటకలో టిక్​ టాక్​ సరదాతో ఇద్దరు సోదరులు మరణించిన విషాద ఘటన మరువకముందే అలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఓ సింగింగ్​ యాప్​లో తనతో కలిసి పాట పాడేందుకు స్నేహితుడు నిరాకరించాడని ఓ మహిళ తీవ్ర మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్యహత్య చేసుకుంది.

సింగింగ్ ​యాప్​కు బానిసై...

బెంగళూరు చిక్కబల్లాపుర జిల్లాకు చెందిన శిల్ప(35) కొద్ది సంవత్సరాలుగా ఓ సింగింగ్ యాప్​ను బాగా వినియోగిస్తోంది. రోజూ పాటలు పాడి అప్​లోడ్ చేస్తోంది. యాప్​లో చాలా మంది ఫ్రెండ్స్​ను సంపాదించుకుంది.

కలిసి ఓ పాట పాడుదామని యాప్​లో స్నేహితుడికి శనివారం సందేశం(రిక్వెస్ట్​) ​ పంపింది శిల్ప. ఏ కారణంతోనో అతను అందుకు నిరాకరించాడు. దీంతో చక్కటి కుటుంబం, ఇద్దరు కొడుకులు ఉన్నారన్న విషయాన్ని కూడా ఆలోచించకుండా ప్రాణాలు పోగొట్టుకుంది శిల్ప.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో...

శిల్ప ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. మహాలయ అమావాస్య సందర్భంగా పూజలో పాల్గొనేందుకు ఆమె భర్త బయటికి వెళ్లాడు. తల్లి మరణంతో ఇద్దరు కొడుకులు తీవ్రంగా కలత చెందారు.

Last Updated : Oct 2, 2019, 9:28 AM IST

ABOUT THE AUTHOR

...view details