తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మునిగిన ముంబయి.. ఎగసిపడుతున్న అలలు

రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ముంబయి నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. రహదారులపై వరద నీరు నిలిచిపోయింది. దీంతో మోకాళ్ల లోతు నీళ్లలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు మహా నగరాన్ని మింగేస్తాయా అన్నట్లు సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి.

Heavy rains in Mumbai and lashes the city from Monday onwards
మునిగిన ముంబయి.. ఎగసిపడుతున్న సముద్రపు అలలు

By

Published : Aug 6, 2020, 3:59 PM IST

దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్ల నగరంలోని పలు ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

నదిని తలపిస్తున్న ఓ కాలనీ
మోకాలు లోతు నీటిలో...
రైలు పట్టాలపై చేరిన వర్షపు నీరు
భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్​
నడుము లోతు నీటిలో ప్రజల ఇక్కట్లు
గొడుగున్నా ఎన్ని పాట్లో...

మోకాళ్ల లోతు నీళ్లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు, బలమైన ఈదురుగాలులతో ముంబయి నగరంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. పలు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. చెట్లు విరిగిపడటం వల్ల వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మహానగరాన్ని మింగేస్తాయా అన్నట్లు సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. అప్రమత్తమైన ముంబయి నగరపాలక సంస్థ.. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపడుతోంది.

ఎగసిపడుతున్న సముద్రపు అలలు
రహదారిని తాకుతున్న అలలు
గాలుల ధాటికి కూలిన బస్‌ షెల్టర్‌
చెట్టు కూలి దెబ్బతిన్న కారు
నేలకొరిగిన భారీ వృక్షాలు
రహదారికి అడ్డంగా విరిగిపడిన చెట్లు
సహాయక చర్యల్లో నగరపాలక సిబ్బంది
గమ్యం చేరాలంటే డివైడర్‌ మీద ఫీట్లు చేయాల్సిందే...

ఇదీ చూడండి:సరిహద్దులో చైనా దురాక్రమణ నిజమే: రక్షణశాఖ

ABOUT THE AUTHOR

...view details