తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హిమాచల్​ ప్రదేశ్​లో వరుణుడి బీభత్సకాండ

హిమాచల్​ ప్రదేశ్​లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బియాస్​, న్యూగల్​ కడ్​ సహా ఇతర నదులు ఉప్పొంగి... జనావాసాలు జలమయం అయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు సాగుతున్నాయి.

హిమాచల్​ ప్రదేశ్​లో వరుణుడి బీభత్సకాండ

By

Published : Aug 17, 2019, 4:58 PM IST

Updated : Sep 27, 2019, 7:28 AM IST

హిమాచల్​ ప్రదేశ్​లో వరుణుడి బీభత్సకాండ

హిమాచల్​ ప్రదేశ్​లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఫలితంగా... లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అనేక చోట్ల కొండ చరియలు విరిగిపడి... రహదారులపై రాకపోకలు స్తంభించాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు అధికారులు.

కాంగ్రా జిల్లాలో...

కాంగ్రా జిల్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. పాలంపుర్​లోని న్యూగల్​ కడ్​ సహా దాని ఉపనదులు ఉప్పొంగి... జనావాసాల్లోకి నీరు చేరింది. నూర్పుర్​ గ్రామంలో కొండ చరియలు విరిగి... మూడు ఇళ్ల దెబ్బతిన్నాయి. భారీ వర్షాల వల్ల లాడ్వారాలో రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బాధితులకు సాయం అందించేందుకు అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన పనిచేస్తోంది.

హైడ్రో ప్రాజెక్టులో ఆరుగురు...

ఓం హైడ్రో ప్రాజెక్టులో ఆరుగురు చిక్కుకుపోయారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి వారిని బయటకు తీశారు.

కులులో....

కులు జిల్లాలో బియాస్​ నది ఉగ్రరూపం దాల్చింది. భడాగ్రాన్వా వద్ద ఇద్దరు వరదలో చిక్కుకున్నారు. వారిని సహాయక సిబ్బంది రక్షించారు.

రోహ్​తంగ్-మనాలీ రోడ్​ బంద్​!

కులు జిల్లాలోని కోక్సర్ వద్ద నాలా ఉప్పొంగి... రోహ్​తంగ్-మనాలీ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.

ఇదీ చూడండి: మంత్రుల బృందం భేటీలో అణు విధానంపైనే చర్చ!

Last Updated : Sep 27, 2019, 7:28 AM IST

ABOUT THE AUTHOR

...view details