పంజాబ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేని వానలకు సట్లెజ్ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జలంధర్‌లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. విద్యుత్ స్తంభించిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఆహారం దొరకక అవస్థలు పడుతున్నారు.
విపత్తు స్పందన దళాలు రంగంలోకి దిగాయి. పలు ప్రాంతాలకు వెళ్లటానికి వీలు లేక సహాయక చర్యలకు అవరోధం ఏర్పడుతోంది. పంజాబ్ ప్రభుత్వం సైన్యం సహాయం కోరింది. హెలికాఫ్టర్ల సాయంతో నీట మునిగిన ప్రాంతాల వారికి ఆహారం సరఫరా చేస్తోంది.