తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో 3 రోజులు తప్పని భానుడి భగభగలు - భారత వాతావరణశాఖ

ఉత్తర భారతంలో ఈ నెల 29-30వ తేదీల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అప్పుడే భానుడి భగభగల నుంచి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని వెల్లడించింది.

Heatwave likely to abate only after May 28: IMD
మరో మూడు రోజులు తప్పని భానుడి భగభగలు.. కానీ

By

Published : May 25, 2020, 7:06 PM IST

భానుడి భగభగలకు ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చల్లటి కబురు. ఈ నెల 29-30వ తేదీల్లో ధూళి, ఉరుములుతో కూడిన వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణశాఖ(ఐఎమ్​డీ) వెల్లడించింది.

పశ్చిమంలో కలిగే మార్పుల వల్ల ఈ నెల 29-30న ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని.. ఆ సమయంలో ఈదురు గాలులు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఐఎమ్​డీ ప్రాంతీయ విభాగానికి చెందిన కుల్దీప్​ శ్రీవాత్సవ తెలిపారు. ఇది ప్రజలకు తీవ్ర ఉపశమనం కలిగిస్తుందన్నారు.

వేడిగాలులతో దిల్లీ, రాజస్థాన్​, హరియాణా, పంజాబ్​, ఉత్తరప్రదేశ్​లోని పులు ప్రాంతాలు తల్లడిల్లిపోతున్నాయి. 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం-మంగళవారం వడగాలుల ప్రభావం భీకరంగా ఉంటుందని వాతావరణశాఖ ఉత్తరభారతంలో హైఅలర్ట్​ ప్రకటించింది.

పంజాబ్​, ఛత్తీస్​గఢ్​, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్​, మహారాష్ట్ర, తెలంగాణ, ఝార్ఖండ్​ రాష్ట్రాలు రానున్న 2-3 రోజుల పాటు వేడిగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐఎమ్​డీ సూచించింది.

ABOUT THE AUTHOR

...view details