తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశంలో తబ్లీగీ వల్లే రెట్టింపు కేసులు'

కరోనా వైరస్ దేశంలో విస్తరిస్తోంది. ఒక్కరోజులో 472మందికి వైరస్ సోకిందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. 24 గంటల్లో 11మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దీంతో మరణాల సంఖ్య 79కి చేరినట్లు స్పష్టం చేసింది. మొత్తంగా వైరస్ సోకినవారి సంఖ్య 3,374కు పెరిగిందని వెల్లడించింది.

deaths
ఒక్కరోజులో 472మందికి వైరస్.. 11మంది మృతి

By

Published : Apr 5, 2020, 5:23 PM IST

Updated : Apr 5, 2020, 5:52 PM IST

భారత్​లో ఒక్కరోజులో 472మందికి కరోనా సోకినట్లు వెల్లడించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. 24 గంటల్లో 11మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పింది. వ్యాధి నయమైన వారి సంఖ్య 266కు చేరిందని చెప్పింది. మొత్తంగా 79మంది వైరస్ కారణంగా మృతి చెందారని.. 3,374మందికి వైరస్ సోకినట్లు స్పష్టం చేసింది.

భారత్​లో కరోనా గణాంకాలు

తబ్లీగీ వల్లే రెట్టింపు..

తబ్లీగీ సమావేశాల వల్లే వైరస్ కేసులు పెరిగినట్లు పేర్కొంది ఆరోగ్యశాఖ. ప్రస్తుతం దేశంలో 4.1 రోజుల్లో వైరస్ కేసులు రెట్టింపు అవుతున్నాయని తెలిపింది. మర్కజ్​ ద్వారా కేసులు పెరగకుండా ఉన్నట్లయితే కేసులు రెట్టింపు అయ్యేందుకు 7.4 రోజులు పట్టేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 274 జిల్లాలు కరోనా వైరస్​తో ప్రభావితమైనట్లు చెప్పారు అధికారులు.

అందుబాటులో టెస్టింగ్​ కిట్లు..

వైరస్ పరీక్షలకు ఉపయోగించే పీపీఈ టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు అధికారులు. ప్రారంభంలో కిట్లకు కొరత ఉండేదని.. అయితే దేశీయ ఉత్పత్తిదారులు కిట్ల తయారీ ప్రారంభించిన నేపథ్యంలో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

మహారాష్ట్రలో 690కి చేరిన కేసులు..

దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో మరో 29 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో వైరస్ సోకినవారి సంఖ్య 690కి చేరింది. ఇప్పటివరకు 32మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ముంబై నగరంలో 409 మంది వైరస్ బాధితులు ఉన్నారు.

ఇదీ చూడండి:కరోనా వాట్సాప్​ నంబర్​కు 2కోట్ల మంది సందేశాలు

Last Updated : Apr 5, 2020, 5:52 PM IST

ABOUT THE AUTHOR

...view details