కర్ణాటకలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో.. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి శ్రీరాములు నిర్వహించిన ఓ పర్యటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిత్రదుర్గ జిల్లా చిల్లెకెరె తాలుకాలో ఇవాళ శ్రీరాములు పర్యటించారు. మంత్రికి స్వాగతం పలకడం కోసం ఆయన అనుచరులు వ్యక్తిగత దూరం మరిచి భారీ ఎత్తున గూమిగూడారు.
'కరోనా'ను విస్మరించి మంత్రి పర్యటన.. నెటిజన్ల విమర్శలు
కర్ణాటకలో ఓ వైపు కరోనా బాధితులు అంతకంతకూ పెరిగిపోతుంటే.. స్వయానా ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఆంక్షలను విస్మరించి పర్యటన చేపట్టారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. కొవిడ్ సమయంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారంటూ.. మంత్రిపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనాను విస్మరించి మంత్రి పర్యటన.. నెటిజన్ల విమర్శలు
శ్రీరాములుపై పూలు జల్లుతూ భారీ పూలమాలతో స్వాగతం పలికారు. ఈ ఊరేగింపులో మంత్రి శ్రీరాములుతో సహా అనేక మంది మాస్కులు లేకుండా కనిపించారు. కరోనా సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.