తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​పై మోదీ హిట్​... కాంగ్రెస్​ 'హిట్​ వికెట్' - CONGRESS

జమ్ముకశ్మీర్‌ అంశంపై కాంగ్రెస్​ నేతల వ్యాఖ్యలు లోక్​సభలో చర్చనీయాంశంగా మారాయి. కశ్మీర్​ దేశ అంతర్గతమా లేక ద్వైపాక్షిక సంబంధమా అనే విషయాన్ని స్పష్టం చేయాలని కాంగ్రెస్ లోక్​సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఆయన మాటలకు సోనియా గాంధీ సైతం నివ్వెరపోయారు.

కశ్మీర్​పై మోదీ హిట్​... కాంగ్రెస్​ 'హిట్​ వికెట్'

By

Published : Aug 6, 2019, 5:58 PM IST

Updated : Aug 6, 2019, 9:08 PM IST

లోక్​సభలో అధిర్​ రంజన్​ చౌదరి

జమ్ముకశ్మీర్​పై మోదీ సర్కారు నిర్ణయాన్ని పార్లమెంట్​ సాక్షిగా చాలా పార్టీలు సమర్థించాయి. మోదీ-షా ద్వయం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కొనియాడాయి. కానీ మొదట్నుంచి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్​కు లోక్​సభలో ఊహించని పరిస్థితి ఎదురైంది. పార్లమెంట్​లో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని భావించి.. భాజపాకు అనుకూలమైన మాటలతో సెల్ఫ్​ గోల్​వేసుకున్నట్లయింది హస్తం పార్టీ పరిస్థితి.

ఇవాళ ఉదయం లోక్​సభలో అధికరణ 370 రద్దు, జమ్ముకశ్మీర్​ పునర్​వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ ప్రారంభమవగానే.. జమ్ముకశ్మీర్‌ అంశం దేశ అంతర్గతమా లేక ద్వైపాక్షిక సంబంధమా అనే విషయాన్ని స్పష్టం చేయాలని కాంగ్రెస్ లోక్​సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి డిమాండ్​ చేశారు.

రంజన్​ మాటలకు పక్కనున్న యూపీఏ చైర్​ పర్సన్​ సోనియా గాంధీ సైతం నిర్ఘాంతపోయారు. విషయం పక్కదారి పడుతుందని భావించి.. తన వెనకున్న నేతలనూ అడిగారు. పరిస్థితిని గమనించిన అధిర్​ రంజన్​.. సర్దిచెప్పుకునేందుకు విఫలయత్నం చేశారు.

" మీరు ఈ అంశాన్ని అంతర్గత వ్యవహారమని అంటున్నారు సరే.. ఒక రాష్ట్రాన్ని విడదీశారు సరే.. కానీ నేను అనేదేంటంటే.. 1948 నుంచి కశ్మీర్​ అంశాన్ని ఐక్యరాజ్య సమితి పర్యవేక్షిస్తోంది ఇది అంతర్గత విషయమా? సిమ్లా ఒప్పందం, లాహోర్​ డిక్లరేషన్​ చేసుకున్నారు.. ఇది అంతర్గత సంబంధమా? ద్వైపాక్షిక ఒప్పందమా? కొన్ని రోజుల క్రితం విదేశాంగ మంత్రి జై శంకర్.. అమెరికా మంత్రి పాంపియోతో మాట్లాడారు. ఆ సమయంలోనూ ఇది ద్వైపాక్షిక అంశమని పేర్కొన్నారు. వీటన్నిటి తర్వాత ఇది అంతర్గత విషయమో కాదో ప్రభుత్వం చెప్పాలి. నేను మీ ద్వారా జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను. కాంగ్రెస్​ పార్టీ మొత్తం జ్ఞానోదయం పొందాలనుకుంటోంది. ఇది ప్రాథమిక ప్రశ్న. కాంగ్రెస్​ దేశానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లు చెప్తున్నారు. అలా ఏం కాదు.

- అధిర్​ రంజన్​ చౌదరి, లోక్​సభ కాంగ్రెస్ పక్ష నేత

అధిర్​ రంజన్​ మాటలను భాజపా ఖండించింది. "ఇన్నాళ్లూ తల లేని కాంగ్రెస్​ పార్టీ.. ఇప్పుడు మెదడు లేనిదిగా మారింది" అని కేంద్రమంత్రి ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ తీవ్ర విమర్శలు చేశారు.

" కశ్మీర్ దేశ అంతర్గత భాగం కాదని, ఈ అంశం అంతర్గతమైనది కాదని మీరు ఎలా అంటున్నారు. ఓటమితో నిరాశ చెందిన కాంగ్రెస్​ నేతలు మానసికంగా దెబ్బతిన్నారు. సోనియాగాంధీ, రాహుల్​ గాంధీలు సభలోనే ఉన్నారు. కానీ ఎవరూ అధిర్​ మాటలను సమర్థించలేదు."
-ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ, కేంద్ర మంత్రి

Last Updated : Aug 6, 2019, 9:08 PM IST

ABOUT THE AUTHOR

...view details