తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోనియా, రాహుల్ విద్వేష ప్రసంగాల వ్యాజ్యం​పై నేడు విచారణ

సోనియా, రాహుల్​, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని దాఖలైన వ్యాజ్యాలను దిల్లీ హైకోర్టు నేడు విచారించనుంది. వీరు ద్వేషపూరిత ప్రసంగాలు చేశారని పిటిషన్​లో పేర్కొన్నారు.

HC to hear on Friday plea seeking FIR against Sonia, Rahul, Priyanka, others for alleged hate speech
సోనియా, రాహుల్ విద్వేష ప్రసంగాల వ్యాజ్యం​పై నేడు విచారణ

By

Published : Feb 28, 2020, 5:20 AM IST

Updated : Mar 2, 2020, 7:59 PM IST

సోనియా, రాహుల్ విద్వేష ప్రసంగాల వ్యాజ్యం​పై నేడు విచారణ

కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ నేతలు రాహుల్​ , ప్రియాంక గాంధీలు విద్వేష ప్రసంగాలు చేశారని.. వారిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై నేడు దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.

లాయర్స్​ వాయిస్​ దాఖలు చేసిన పిటిషన్​ను గురువారం జస్టిస్​ డీఎన్​ పాటిల్​, జస్టిస్​ సీ హరి శంకర్​ ధర్మాసనం వద్ద ప్రస్తావించగా.. శుక్రవారం విచారణ జాబితాలో చేర్చాలని ఆదేశించింది.

దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియా, ఆమ్​ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమనతుల్లాహ్​ ఖాన్​, ఏఐఎమ్​ఐఎమ్​ నేత అక్బరుద్దీన్​ ఓవైసీ పైనా ఎఫ్​ఐఆర్​ దాఖలు చేయాలని పిటిషన్​లో పేర్కొన్నారు. ద్వేషపూరిత ప్రసంగాలను పరిశీలించడానికి ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా పిటిషన్​లో కోరారు.

గాయపడ్డ వారిని, మృతదేహాలను సురక్షితంగా ఆసుపత్రులకు చేరవేసేందుకు సంబంధించిన వ్యాజ్యాలపైనా దిల్లీకోర్టు నేడు విచారణ చేపట్టనుంది.

Last Updated : Mar 2, 2020, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details