తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోషల్​ మీడియాకు కొత్త రూల్స్​- కేంద్రం, ట్విట్టర్​కు హైకోర్టు నోటీసులు

సామాజిక మాధ్యమాల్లో సెన్సార్​షిప్​ నిబంధనలకు సంబంధించి కేంద్రానికి దిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. సెన్సార్​షిప్​ నిబంధనలను రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన వ్యాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం.. ప్రభుత్వం స్పందన తెలియజేయాలని ఆదేశించింది.

DL-HC-TWITTER
DL-HC-TWITTER

By

Published : Jan 6, 2020, 5:13 PM IST

సామాజిక మాధ్యమాల్లో విధివిధానాలకు సంబంధించి కేంద్రం, ట్విట్టర్​కు నోటీసులు పంపింది దిల్లీ హైకోర్టు. సెన్సార్​షిప్​ నిబంధనలను కేంద్రం రూపొందించేలా ఆదేశాలివ్వాలని సీనియర్ న్యాయవాది సంజయ్​ హెగ్డే వ్యాజ్యం దాఖలు చేశారు.

హెగ్డే వ్యాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం.. కేంద్రం, ట్విట్టర్​ స్పందించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది.

ట్విట్టర్​లో తన ఖాతాను శాశ్వతంగా తొలగించినందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు హెగ్డే. రెండు పోస్టులను రీట్వీట్​ చేసినందుకు ట్విట్టర్​ ఈ చర్య తీసుకుందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ప్రచురణ నిబంధనలను కేంద్రం నిర్ణయించాలని హెగ్డే కోరారు.

ABOUT THE AUTHOR

...view details