ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ వారణాసి నియోజకవర్గ పోటీని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 21న కేసు విచారించనున్నట్లు జస్టిస్ ఎంకే గుప్తా వెల్లడించారు.
సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేయాలని భావించినబీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్‌బహదూర్ యాదవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
బీఎస్ఎఫ్ నుంచి అవినీతి, అవిశ్వాసం కారణాలతో బయటకు రాలేదని స్పష్టం చేస్తూ ధ్రువీకరణ పత్రాలు సమర్పించని కారణంగా రిటర్నింగ్ అధికారి తేజ్‌బహదూర్ యాదవ్ నామినేషన్‌ను తిరస్కరించారు.
తన నామపత్రాన్ని తప్పుడు కారణంతో తిరస్కరించారని ఆరోపించారు తేజ్ బహదూర్. మోదీ ఎన్నికను రద్దు చేయాలని పిటిషన్లో అభ్యర్థించారు. జవాను వాదనలు వినకుండానే నామినేషన్ పత్రాలను తిరస్కరించారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆరోపించారు. ఈ మేరకు మోదీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇదీ చూడండి:- అవసరమైతే జైలుకైనా వెళ్తా: ప్రియాంక గాంధీ