లోక్‌సభలో ప్రతిపక్షనేత ఎంపికపై అత్యవసర విచారణ చేయాలన్న పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ వ్యాజ్యంపై తక్షణ విచారణ అవసరం లేదని తేల్చింది. అందుకే జులై 8న వాదనలు విననున్నట్లు తీర్పునిచ్చింది.
'లోక్‌సభ ప్రతిపక్షనేత నియామకానికి తొందరెందుకు?' - LS
లోక్‌సభలో ప్రతిపక్షనేత ఎంపికపై అత్యవసర విచారణ చేయాలన్న పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ వ్యాజ్యంపై వెంటనే వాదనలు వినాల్సిన అవసరం లేదని తెలిపింది. జులై 8న పిటిషన్‌ను విచారించనున్నట్లు తెలిపింది.
లోక్‌సభ ప్రతిపక్ష నేత నియామకంపై న్యాయవాదులు మన్మోహన్ సింగ్ నరులా, సుష్మితా కుమారి దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రతిపక్షనేతను ఎంపిక చేయకుండా స్పీకర్ చట్టపరమైన విధులను నిర్వర్తించట్లేదని వ్యాజ్యంలో పేర్కొన్నారు. చట్టసభ సభ్యుడిని ప్రతిపక్షనేతగా ఎన్నుకోవడం రాజకీయ నిర్ణయం కాదని చట్టపరమైన నిర్ణయమని కోర్టుకు తెలిపారు.
ప్రతిపక్షనేతను ఎన్నుకునేందుకు ప్రత్యేక విధానాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పదవి కోసం అభ్యర్థించే పార్టీ లోక్‌సభలోని విపక్షాల్లో అత్యంత పెద్ద పార్టీనో కాదో స్పీకర్ నిర్ధరించుకోవాలన్నారు. అలాగే పార్లమెంట్ చట్టంలో ప్రతిపక్షనేత జీత, భత్యాలపై ఎలాంటి నియమం లేదని కోర్టుకు తెలిపారు.