తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ముందుగా అబద్ధాల వ్యర్థాలను శుభ్రపరచాలి'

స్వచ్ఛ భారత్​ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ముందుగా దేశంలో పెరిగిపోతున్న అబద్ధాల చెత్తను తొలగించాలని ఎద్దేవా చేశారు. చైనా చొరబాట్లపై నిజాన్ని చెప్పి సత్యాగ్రహాన్ని ప్రారంభించాలని అన్నారు.

Have to clean 'garbage of falsehood': Rahul
'ముందుగా అబద్ధాల వ్యర్థాలను శుభ్రపరచాలి'

By

Published : Aug 9, 2020, 5:47 AM IST

దేశాన్ని చెత్తనుంచి విముక్తి చేయడంలో భాగంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. దేశాన్ని చెత్త నుంచి విముక్తి చేసే ముందు రోజురోజుకూ పెరిగిపోతున్న అబద్ధాల వ్యర్థాలను శుభ్రపరచాలని ఎద్దేవా చేశారు. ముందుగా.. చైనా చొరబాట్లపై స్పందించి సత్యాగ్రహాన్ని ప్రారంభించాలని విమర్శించారు.

స్వచ్ఛ భారత్​ అంశంపై వారం రోజుల ప్రచార కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు మోదీ. ఇందులో పాల్గొని చెత్త విముక్త భారత్​ కోసం ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి ప్రధాని కార్యాలయం చేసిన ట్వీట్​పై రాహుల్ స్పందించారు.

"మనం మరో అడుగు ముందుకు వేసి దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న అబద్ధాల చెత్తను శుభ్రం చేయాలి. చైనా దురాక్రమణపై ప్రధాని నిజాలు చెప్పి సత్యాగ్రహాన్ని ప్రారంభిస్తారా?."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

యాదృచ్ఛికం కాదు

చైనా దురాక్రమణకు సంబంధించిన పత్రాలను రక్షణ శాఖ తొలగించడంపైనా విమర్శలు సంధించారు రాహుల్.

"దేశం భావోద్వేగానికి గురైనప్పుడల్లా.. దస్త్రాలు కనుమరుగవుతాయి. అది మాల్యా అయినా.. రఫేల్ అయినా లేదా మెహుల్​ చోక్సీ, నీరవ్ మోదీ ​విషయమైనా. ఇప్పడు తప్పిపోయిన జాబితాలో చైనా ఆక్రమణకు సంబంధించిన పత్రాలు సైతం చేరిపోయాయి."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

పత్రాలు తొలగించడం యాదృచ్ఛికంగా జరిగింది కాదని ఆరోపించారు రాహుల్. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం చేసిన ప్రయోగమని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details