తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హరియాణా: కింగ్​మేకర్​తో కాంగ్రెస్​ సంప్రదింపులు!

ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను తలకిందులు చేస్తూ... హరియాణాలో అధికార భాజపాతో సమానంగా కాంగ్రెస్​ పరుగులు పెడుతోంది. ఇరు పార్టీల మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది. హంగ్​ దిశగా అడుగులు పడుతోన్న నేపథ్యంలో కాంగ్రెస్​ అధినాయకత్వం.. కింగ్​ మేకర్​ కానున్న జేజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

By

Published : Oct 24, 2019, 12:30 PM IST

Updated : Oct 24, 2019, 3:09 PM IST

హరియాణా: కమలం- కాంగ్రెస్​ మధ్య హోరాహోరీ

హరియాణాలో ఏడుగురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. భాజపా జోరు ఖాయమని ఎగ్జిట్​ పోల్స్​ ముక్తకంఠంతో నినదించినప్పటికీ.. కాంగ్రెస్​-కమలం మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది.

మహారాష్ట్రలో ఫలితం అనుకున్నట్లు లేకపోయినా... హరియాణాలో పట్టు బిగించాలని కాంగ్రెస్​ యోచిస్తోంది. ఇప్పటికే హంగ్​ ఛాయలు కనపడుతుండటం వల్ల... కాంగ్రెస్​ అధినాయకత్వం కింగ్​మేకర్​ జేజేపీతో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు సమాచారం. స్వయంగా సోనియాగాంధీ... సీనియర్​ నేత భూపీందర్​ సింగ్​ హుడాను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు...

ప్రస్తుత సరళిని చూస్తే ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. జన్‌నాయక్‌ జనతా పార్టీ కింగ్‌మేకర్‌ పాత్ర పోషించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో స్వతంత్రులు కూడా కీలకం కానున్నారు.

2014లో...

2014లో హరియాణాలో 90 స్థానాలకుగాను భాజపా 47 సీట్లలో గెలుపొందగా, కాంగ్రెస్15 స్థానాలు, ఐఎన్​ఎల్​డీ 19 సీట్లలో విజయం సాధించాయి.

Last Updated : Oct 24, 2019, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details