ఏమరపాటుగా ఉంటే రెండడుగుల వర్షపు నీటిలో ఆ మొసలి కనిపించి ఉండకపోయేది. ఎవ్వరికీ ఎలాంటి హాని జరగకముందే మకరాన్ని గుర్తించారు స్థానికులు. అధికారులకు పట్టించి ఊపిరి పీల్చుకుంటున్నారు.
నది ఉప్పొంగి వరదొచ్చింది.. మొసలి కాలనీకొచ్చింది! - గుజరాత్
గుజరాత్లో భారీ వర్షాలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. వర్షాలకు నది సమీప ప్రాంతాలన్నీ వరదమయం అవుతున్నాయి. నదుల్లో ఉండే జీవులు ప్రవాహంతోసహా కాలనీల్లోకి వచ్చేస్తున్నాయి. చిన్న చిన్న చేపలొస్తే ఏమో గానీ, చిన్న చిన్న మొసల్లొస్తే.. గుజరాత్లో అచ్చం ఇదే జరిగింది. జనాలు బెంబేలెత్తిపోయారు.
నది ఉప్పొంగింది... వరదలో మొసలి కాలనీకొచ్చింది!
ఇదీ చూడండి:75 ఏళ్లు పైబడిన వారికి భోజనం ఉచితం