తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వలస కార్మికుల అందోళన.. 40మంది అరెస్ట్​

సొంత రాష్ట్రాలకు పంపించాలని డిమాండ్​ చేస్తూ గుజరాత్​ సూరత్​ జిల్లా మోరా గ్రామంలో వలస కూలీలు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవటం వల్ల రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Guj: Migrant workers clash with police in Surat
పోలీసులు, వలస కూలీల మధ్య ఘర్షణలు.. 40 మంది అరెస్టు

By

Published : May 9, 2020, 2:06 PM IST

గుజరాత్​ సూరత్ జిల్లా మోరా​ గ్రామంలో లోని వలస కూలీల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తమను సొంత రాష్ట్రాలకు పంపేందుకు అధికారులు వాహనాలు ఏర్పాటు చేయాలని వందల మంది కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

పోలీసులు, వలస కూలీల మధ్య ఘర్షణ

ఆగ్రహించిన కూలీలు అధికారులపై రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేశారు. కూలీలను అదుపు చేసేందుకు లాఠీ ఝుళిపించారు పోలీసులు. ఈ ఘటనలో మొత్తం 40 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​, ఒడిశా, ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది వలస కార్మికులు మోరా, హజీరా ప్రాంతాల్లోని కర్మాగారాల్లో పని చేస్తున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details