పాకిస్థాన్‌ను ప్రపంచ ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ (ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్ట్‌లో కొనసాగించటంపై భారత సైన్యాధ్యక్షుడు బిపిన్ రావత్ స్పందించారు. శాంతి స్థాపించే దిశగా పాక్ కృషి చేయాలని ఆకాంక్షించారు.
గాయపడిన సైనికులు, మరణించిన జవాన్ల బంధువుల గౌరవార్థం.. భారత సైన్యం ఆధ్వర్యంలో దిల్లీ కరియప్ప పరేడ్ మైదానంలో నిర్వహించిన 'అల్టిమేట్ రన్'ను ప్రారంభించారు రావత్. ఈ సందర్భంగా పాక్‌ను ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో కొనసాగించటంపై మాట్లాడారు.
"పాక్‌పై ఒత్తిడి ఉంది. వాళ్లు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శాంతి స్థాపించే దిశగా వాళ్లు కృషి చేయాలని మేం ఆకాంక్షిస్తున్నాం. గ్రే లిస్ట్‌లో చేరటం ఏ దేశానికైనా ఎదురుదెబ్బే."