ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని దోషిగా చూపేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు ఆయన కుటుంబ సభ్యులు. వివిధ దేశాల్లో ఆస్తులు, డొల్ల కంపెనీలు ఉన్నాయన్న ఆరోపణలకు సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మీడియా నిగ్రహంగా వ్యవహరించట్లేదని విమర్శించారు.
"మాకు వివిధ దేశాల్లో ఆస్తులు, బహుళ బ్యాంక్ ఖాతాలు, డొల్ల కంపెనీలు ఉన్నాయన్న ఆరోపణలను విని ఆశ్చర్యపోయాం. వీటిన్నింటికీ ఒక చిన్న ఆధారాన్నైనా చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీడియా క్రూరంగా, నిజ నిర్ధరణ చేయకుండా, నిరాధారంగా కథనాలు ప్రసారం చేస్తోంది. ఇలాంటి వార్తలపై మీడియా నిగ్రహంగా ఉండాలి. స్వేచ్ఛ, గౌరవాన్ని కాపాడుకోవాలి."
- చిదంబరం కుటుంబం.