తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సమావేశాల పొడగింపునకు ప్రభుత్వం యోచన! - పొడిగింపు

పార్లమెంట్​ సమావేశాలను మరో 2- 3 రోజుల పాటు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్​ ప్రకారం జూన్​ 17న మొదలైన 17వ లోక్​సభ తొలి పార్లమెంట్​ సమావేశాలు ఈ నెల 26తో ముగుస్తాయి. కానీ సభలను పొడిగించాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.

పార్లమెంట్​ సమావేశాల పొడగింపునకు ప్రభుత్వం యోచన!

By

Published : Jul 19, 2019, 8:54 AM IST

17వ లోక్​సభ తొలి పార్లమెంట్​ సమావేశాలను పొడిగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.జూన్​ 17న ప్రారంభమైన సమావేశాలు షెడ్యూల్​ ప్రకారం ఈ నెల 26తో ముగుస్తాయి. అయితే మరో రెండు, మూడు రోజుల పాటు పొడిగించేందుకు భాజపా నేతలు యోచిస్తున్నారు.

"పార్లమెంట్​ సమావేశాలను 2-3 రోజులపాటు పొడిగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషయమై విపక్ష నేతలతో భాజపా సంప్రదింపులు జరుపుతోంది."
- ప్రభుత్వ అధికారి.

అవసరమైతే పార్లమెంట్​ సమావేశాలను పొడిగించవచ్చని మంగళవారం జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ సూచించినట్టు సమాచారం.

ఇదీ చూడండి:- వరద బీభత్సంతో రాష్ట్రాలు అతలాకుతలం

ABOUT THE AUTHOR

...view details