పంట బీమా అమలు అంశంపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది కేంద్రం. ఇది కచ్చితంగా అందరు రైతులకు వర్తింపజేయాలా లేదా వారి ఎంపికకే వదిలేయాలా అన్న అంశంపై నిర్ణయించేందుకే అభిప్రాయాలు కోరినట్టు లోక్సభలో తెలిపింది కేంద్రం.
ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా ఈ విధంగా బదులిచ్చారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పథకం కచ్చితంగా అమలుకు నోచుకోవాల్సిన అవసరముంది.
పంట బీమా పథకంపై లోక్సభలో కేంద్ర మంత్రి రూపాలా సమాధానం ''కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు సంఘాలు ఈ పథకాన్ని స్వచ్ఛందంగా అమలుచేయాలని డిమాండ్ చేసిన అనంతరం.. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోరుతూ లేఖ రాశాం. రుణాలు పొందిన వారికి పథకాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరముంది. రుణాలు ఇంకా పొందని వారికి ఐచ్ఛికంగా ఉంచాలని చూస్తున్నట్లు లేఖలో తెలిపాం.''
- పురుషోత్తం రూపాలా, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి