భారత ఫార్మా రంగాన్ని ప్రోత్సహిస్తూ.. స్వదేశీ ఔషధాలు, వైద్య పరికరాల ఉత్పత్తులు పెంపొందించే నాలుగు పథకాల మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 'ఆత్మ నిర్భర్' ఆశయాలకు అనుగుణంగా.. ఫార్మా రంగంలో ఈ కొత్త పథకాలను రూపొందించినట్లు తెలిపారు కేంద్ర రసాయన, ఎరువుల శాఖా మంత్రి డీవీ సదానంద గౌడ.
ఇప్పటి వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న 53 యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ), కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కేఎస్ ఎమ్) సహా పలు వైద్య ఉత్పత్తి పరికరాలను ఇకపై భారత్లోనే తయారు చేయడానికి కొత్త పథకాలు దోహదపడతాయన్నారు. ఔషధాల కోసం మరో దేశంపై ఆధారపడే అవసరం లేకుండా చేస్తాయన్నారు సదానంద.
"ప్రస్తుతం 40 బిలియన్ డాలర్లుగా ఉన్న ఫార్మా రంగం విలువ.. 2024 వరకల్లా 100 బిలియన్ డాలర్లు వృద్ధి చెందుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థను 2025 వరకల్లా... 5 ట్రిలియన్ డాలర్లు చేయాలన్న్ ప్రధాని ఆశయం నెరవేర్చడానిగి తోడ్పడుతుంది. ఈ పథకాలు ఫార్మా రంగం దశదిశలు పూర్తిగా మార్చేస్తాయి. అందుకే, పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వాలు సహా వాటాదారులతో లోతైన సంప్రదింపులు జరిపిన తరువాతే ఈ మార్గదర్శకాలు రూపొందించాం. "