తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అన్​లాక్​-2 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం

govt-of-india-announces-unlock-2-guidelines
మార్గదర్శకాలివే...

By

Published : Jun 29, 2020, 9:57 PM IST

Updated : Jun 29, 2020, 10:29 PM IST

21:58 June 29

మార్గదర్శకాలివే...

అన్‌లాక్‌-2 విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కంటైన్‌మెంట్ జోన్లలో జులై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆ జోన్లలో నిత్యావసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొంది.

కేంద్ర, రాష్ట్ర శిక్షణా సంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే అంతర్జాతీయ ప్రయాణాలు చేయాలని తేల్చిచెప్పింది. నిర్దేశిత నియమాల ప్రకారం అంతర్రాష్ట్ర, అంతర్గత ప్రయాణికుల సర్వీసులు కొనసాగించింది.

వీటిపై కొనసాగనున్న నిషేధం...

  • మెట్రోరైళ్లు, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌.
  • సామాజిక, రాజకీయ, మత పరమైన కార్యకలాపాలు.
  • ఎక్కువ సంఖ్యలో గుమిగూడటం.
  • రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ ఉంటుందని కేంద్ర పేర్కొంది.
  • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం.
  • బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, పాన్‌, గుట్కా నమలడం, పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం

ఇవి పాటించాల్సిందే...

బయట తిరిగే వారు మాస్కు ధరించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ప్రతి ప్రదేశంలో 6 అడుగుల దూరాన్ని పాటించాలని వెల్లడించింది. దుకాణాలన్నీ కేంద్రం మార్గదర్శకాల మేరకు ఏర్పాటు చేయాలని తెలిపింది.

వివాహం, వివాహ సంబంధిత కార్యక్రమాలకు 50 మందికి మించి అనుమతి లేదు. అంత్యక్రియల్లో 20 మందికి మాత్రమే అనుమతి.  

నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.

21:52 June 29

అన్​లాక్​-2 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం

అన్​లాక్​-2 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. జులై 31వరకు కంటైన్​మెంట్​ జోన్లలో లాక్​డౌన్​ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ జోన్లలో నిత్యావసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొంది.

Last Updated : Jun 29, 2020, 10:29 PM IST

ABOUT THE AUTHOR

...view details