తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆగస్టు 2 వరకు పార్లమెంట్ సమావేశాల పొడిగింపు!

పార్లమెంట్​ సమావేశాలను ఆగస్టు రెండో తేది వరకూ పొడిచించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.   ముందుగా ప్రకటించిన షెడ్యూల్​ ప్రకారం జూన్​ 17న మొదలైన 17వ లోక్​సభ తొలి పార్లమెంట్​ సమావేశాలు ఈ నెల 26తో ముగుస్తాయి. కానీ పెండింగ్​లో ఉన్న వివిధ బిల్లుల ఆమోదం కోసం సభను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఆగస్టు 2 వరకు పార్లమెంట్ సమావేశాల పొడగింపు!

By

Published : Jul 20, 2019, 8:30 AM IST

Updated : Jul 20, 2019, 10:03 AM IST

17వ లోక్​సభ తొలి పార్లమెంట్​ సమావేశాలను పొడిగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. వివిధ బిల్లుల ఆమోదం పెండింగ్​లో ఉన్న దృష్ట్యా ఆగస్టు రెండో తేది వరకు సమావేశాలను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. పొడిగింపు లేనట్లయితే జూన్​ 17న ప్రారంభమైన సమావేశాలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26తో ముగుస్తాయి.

సమావేశాల పొడిగించే అంశమై విపక్ష పార్టీలతో కేంద్ర మంత్రులు చర్చిస్తున్నారని సమాచారం. సమావేశాల పొడిగింపునకు సుముఖంగా లేమని కొంతమంది విపక్ష నేతలు వ్యాఖ్యానించారు.

ముమ్మారు తలాక్ సహా 13 బిల్లులకు సభ ఆమోదం లభించలేదు. ఈ నేపథ్యంలోనే సభను పొడిగించడానికి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ముమ్మారు తలాక్ బిల్లు ప్రస్తుత సమావేశాల చివరి వారంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే లోక్​సభ షెడ్యూల్​ సమయానికి మించి పనిచేస్తోంది. ఈ సమావేశాల్లో రెండు సార్లు అర్ధరాత్రి వరకూ కార్యకలాపాలు నిర్వహించింది.

"ఈ దఫా సమావేశాలు నిర్ణీత వేళలను మించి పనిచేస్తున్నాయి. 2019, జులై 16 వరకు 128 శాతం ఉపయోగకరంగా సమావేశాలు జరిగాయి. గత 20 ఏళ్లలో ఇదే అత్యధిక సమయం"

-పీఆర్​ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్

జులై 16వరకు రాజ్యసభ 98 శాతం ఉత్పాదకతతో పనిచేసింది.

నిర్ణయించిన కాలవ్యవధితో వాస్తవంగా సభ జరిగిన సమయాన్ని పోల్చిసమావేశాల ఉత్పాదకతనులెక్కిస్తారు.

ఇదీ చూడండి: సోమవారానికి కర్​నాటకీయం వాయిదా!

Last Updated : Jul 20, 2019, 10:03 AM IST

ABOUT THE AUTHOR

...view details