ఈ -సిగరెట్స్పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. దేశంలో ఎలక్ట్రానిక్ సిగరెట్స్ను నిషేధిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. వాటి తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం లేదా ప్రకటనలు చేస్తే నేరంగా పరిగణించి జైలు శిక్ష విధించేందుకు నిర్ణయించింది.
ఈ-సిగరెట్స్తో మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు శిక్షతో పాటు ఒక లక్ష రూపాయలు జరిమానా విధిస్తారు. ఆ తదుపరి నేరానికి పాల్పడితే సుమారు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, లేక రూ.5 లక్షల జరిమానా విధిస్తారు. ఒక్కోసారి రెండూ విధించే అవకాశం ఉంది.