కరోనాతో పాటు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వర్షాకాలం, శీతకాలాల్లో నిర్దిష్ట ప్రాంతాల్లో సంక్రమించే అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
సీజనల్ వ్యాధుల వేళ కొవిడ్ కొత్త మార్గదర్శకాలు - కరోనా వైరస్ వార్తలు
సీజనల్ వ్యాధుల కాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కొవిడ్- 19 మార్గదర్శకాలను సవరించింది. వర్షాకాలం, శీతకాలాల్లో నిర్దిష్ట ప్రాంతాల్లో సంక్రమించే అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కొవిడ్ మార్గదర్శకాలు
ప్రస్తుత కాలంలో సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా, ఇన్ఫ్లూయెంజా (హెచ్1ఎన్1), చికున్ గున్యా వంటివి విజృంభించే అవకాశం ఉంది. కరోనా రోగుల్లోనూ ఈ వ్యాధులు సోకే ప్రమాదమూ ఉంది. డబ్ల్యూహెచ్ఓ నిర్ధరించిన కొవిడ్ లక్షణాలు.. సీజనల్ వ్యాధులతో సరిపోలుతున్న కారణంగా కొత్త సూచనలను జారీ చేసింది. వాటిలో కొన్ని...
- కరోనా కేసుల్లోనూ బాక్టీరియల్ కో-ఇన్ఫెక్షన్లపై దృష్టి సారించాలి.
- కరోనా చికిత్స కేంద్రాల్లో ఈ వ్యాధులకు సంబంధించిన టెస్ట్ కిట్లను అందుబాటులో ఉంచాలి.
- ముందుగానే డెంగీ/మలేరియా ఉన్నట్లు తేలితే వారికి కరోనా లేదని భావించకూడదు.
- ఆయా ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులతో పాటు కరోనా కేసులు అధికంగా ఉన్న చోట రెండింటికీ పరీక్షలు నిర్వహించాలి.
ఇదీ చూడండి:'మహా'లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు