ప్రభుత్వానికి కాంగ్రెస్ అభ్యర్థన జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో బుధవారం జరిగిన ఉగ్రదాడిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రభుత్వం, నిఘా సంస్థలు సంయమనంతో ఇలాంటి దాడులను అరికట్టాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా అభ్యర్థించారు.
రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ట్వీట్ "అనంత్‌నాగ్‌లో ఐదుగురు సీఆర్ఫీఎఫ్ జవాన్ల మరణించారని, నలుగురు గాయపడ్డారని వినడానికే బాధగా ఉంది. మన సైనికుల పరాక్రమానికి జోహార్లు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం, నిఘా సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలి."
-రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి
జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్‌లోని కేపీ రోడ్లో గస్తీ విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బృందంపై ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. అత్యాధునిక రైఫిళ్లు, గ్రనేడ్లతో దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఎన్కౌంటర్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు.
ఇదీ చూడండి: ఐదుగురు జవాన్లను బలిగొన్న ముష్కరులు