తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇస్లామిక్​ స్టేట్​లోకి తెలుగు రాష్ట్రాల వ్యక్తులు!

దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వారు ఉగ్రవాద సంస్థల్లో చేరుతున్న ఘటనలను ప్రభుత్వ ఏజెన్సీలు గుర్తించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇస్లామిక్ స్టేట్​ ఉనికికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 5 రాష్ట్రాల్లో 17 కేసులను నమోదు చేసినట్లు రాజ్యసభకు వెల్లడించారు.

Govt has info that some individuals, including from South, joined IS: MoS Home
తెలుగు రాష్ట్రాల్లో ఇస్లామిక్ స్టేట్ బుసలు!

By

Published : Sep 16, 2020, 12:57 PM IST

దక్షిణాది రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఉగ్రవాద సంస్థల్లోకి చేరుతున్న ఘటనలను గుర్తించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభకు వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్​(ఐఎస్) ఉగ్ర సంస్థలో కొంతమంది చేరినట్లు భద్రత, నిఘా సంస్థలు గుర్తించాయని చెప్పారు.

ఐఎస్​ ఉనికికి సంబంధించి తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో 17 కేసులను జాతీయ దర్యాప్తు బృందం(ఎన్​ఐఏ) నమోదు చేసినట్లు పేర్కొన్నారు కిషన్​ రెడ్డి. ఇందులో భాగంగా 122 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు మంత్రి.

"ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేయడానికి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు. దీనిపై సైబర్ ఏజెన్సీలు కన్నేసి ఉంచాయి. వీరిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నాయి. వీరికి నిధులు ఎలా అందుతున్నాయి, ఉగ్ర కార్యకలాపాల కోసం విదేశాల నుంచి డబ్బు అందుతుందా అనే విషయంపై ప్రభుత్వానికి సమాచారం ఉంది."

-కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, బంగాల్, రాజస్థాన్, బిహార్, ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్ము కశ్మీర్​లో ఇస్లామిక్ స్టేట్ చాలా యాక్టివ్​గా ఉన్నట్లు ఎన్​ఐఏ దర్యాప్తులో తేలిందని వెల్లడించారు కిషన్​ రెడ్డి.

ఇస్లామిక్ స్టేట్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా, ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖొరాసన్ ప్రావిన్స్(ఐఎస్​కేపీ), ఐఎస్​ఐఎస్​ విలియాట్ ఖొరాసన్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ షామ్-ఖొరాసన్(ఐఎస్​ఐఎస్​-కే) సహా వీటితో సంబంధం ఉన్న గ్రూపులను ఉగ్ర సంస్థలుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ సంస్థలను చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం షెడ్యూల్ 1లో చేర్చినట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి-చంబల్​ నదిలో పడవమునక-ఐదుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details