తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సాగు చట్టాలపై రైతు సంఘాలకు కేంద్రం లేఖ

సాగు చట్టాల్లో పలు సవరణలకు అంగీకరించిన కేంద్రం.. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను రైతులకు పంపించింది. కేంద్రం చేసిన ప్రతిపాదనలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు రైతు సంఘాలు తెలిపాయి. సాయంత్రం ఈ అంశంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Farmers protest
రైతుల ఆందోళనలు

By

Published : Dec 9, 2020, 12:23 PM IST

వ్యవసాయ చట్టాల్లో సవరణలపై రైతు సంఘాలకు కేంద్రం కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను లిఖితపూర్వకంగా పంపింది.

కేంద్ర ప్రభుత్వం రైతులకు పంపించిన లేఖలోని కీలక ప్రతిపాదనలు ఇవే..

  • ప్రభుత్వ మార్కెట్లను బలోపేతం చేయటం
  • ఏపీఎంసీలపై రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా సవరణ, ఏపీఎంసీల్లో ఒకే పన్ను విధానం
  • ప్రైవేటు కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్​ తప్పనిసరి
  • ప్రైవేటుతో పాటు ప్రభుత్వం కూడా పంట సేకరణ చేసేలా నిబంధనల్లో మార్పు
  • వ్యాపారులు-రైతుల ఒప్పంద వివాద పరిష్కారంలో ఎస్​డీఎంల అధికారాల సవరణ
  • ఒప్పంద వ్యవసాయంలో సివిల్​ కోర్టును ఆశ్రయించేందుకు వీలు
  • ఒప్పంద వ్యవసాయంలో రైతుల భూముల రక్షణ కల్పించేలా నిబంధనలు
  • కనీస మద్దతు ధరపై లిఖితపూర్వక హమీ
  • పంట వ్యర్థాల దహనం అంశంపై పంజాబ్​, హరియాణా రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం

కేంద్రం ప్రతిపాదనలపై రైతు సంఘాల ప్రతినిధులు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఈ విషయంపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

మూడు కొత్త చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబడుతున్నారు. అయితే... సవరణలకు మాత్రమే కేంద్రం అంగీకరించింది. ఈ నేపథ్యంలో బుధవారం జరగాల్సిన 6వ విడత చర్చలు రద్దయ్యాయి.

ఇదీ చూడండి: సవరణలకు ఓకే- చట్టాల రద్దుకు సర్కార్​ ససేమిరా

ABOUT THE AUTHOR

...view details