గల్వాన్ లోయలో.. భారత్- చైనా బలగాల మధ్య ఘర్షణల అనంతరం టిక్ టాక్ సహా 59 చైనా యాప్‌లను నిషేధించింది కేంద్రం. ఇప్పుడు ఆ దేశానికి చెందిన మరో 47 యాప్‌లను నిషేధించింది. గతంలో నిషేధం విధించిన... 59 యాప్‌లకు అనుసంధానంగా , మారుపేర్లతో ఉన్న టిక్ టాక్ లైట్, హలో లైట్, షేరిట్ లైట్, బిగో లైట్, వీఎఫ్‌వై లైట్ వంటి 47 యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది.
చైనాకు మళ్లీ ఝలక్.. పబ్జీ సహా 280 యాప్‌లపై నిషేధం! - BAN ON PUBG
ఇప్పటికే 59 చైనా యాప్‌లను నిషేధించిన భారత ప్రభుత్వం.. మరో 47 యాప్‌లపై ఆంక్షలు విధించినట్లు సమాచారం. పబ్ జీ సహా సుమారు 280 యాప్‌లపై ఇప్పటికే నిఘా పెట్టిన కేంద్రం.. చైనాలో సర్వర్లు ఉన్న అన్ని యాప్‌లను నిషేధించాలని భావిస్తోంది.
చైనాలో సర్వర్లు ఉన్న యాప్‌లను గుర్తించేందుకు కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోంది. పబ్ జీ సహా.. సుమారు 280 యాప్‌లపై ఇప్పటికే నిఘా పెట్టిన కేంద్రం.. చైనాలో సర్వర్లు ఉన్న అన్ని యాప్‌లను నిషేధించాలని భావిస్తోంది. సుమారు 20 చైనా యాప్‌ల ద్వారా డేటా మార్పిడి, తస్కరణ జరుగుతోందని గుర్తించిన అధికారులు.. ఆ యాప్‌ల సమాచారం సేకరిస్తున్నారు. తాజాగా మరికొన్ని చైనా యాప్‌లపై నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది
ఇవీ చూడండి:-చైనా యాప్స్‌పై నిషేధం- స్వదేశీ సత్తాకు అవకాశం