తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గూగుల్​ ఉద్యోగికి కరోనా.. ఇంటి నుంచే పనిచేయాలని సూచన!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాతో అన్ని దేశాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తాజాగా బెంగళూరులోని తమ సంస్థ ఉద్యోగికి వైరస్​ సోకినట్లు గూగుల్​ తెలిపింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని చెప్పినట్లు పేర్కొంది.

Google: We can confirm that an employee from our Bengaluru office has been diagnosed with COVID-19.
గూగుల్​ ఉద్యోగికి కరోనా.. ఇంటి నుంచే పనిచేయాలని సూచన

By

Published : Mar 13, 2020, 10:47 AM IST

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు చాలా దేశాల్లో మరణాల సంఖ్య పెరిగిపోతుంటే.. ఉద్యోగస్థులనూ ఈ వైరస్​ వణికిస్తోంది.

బెంగళూరులో తమ సంస్థకు చెందిన ఉద్యోగికి కరోనా సోకినట్లు గూగుల్​ తెలిపింది. ఈ నేపథ్యంలోనే అక్కడి ఆఫీసులో పని చేస్తున్న తమ ఉద్యోగులను రేపటి నుంచి ఇంటి నుంచే పనిచేయాలని చెప్పినట్లు ​ సంస్థ పేర్కొంది.

112 మందికి కరోనా నెగిటివ్​..

దిల్లీ ఐటీబీపీ ప్రత్యేక శిబిరంలో వైద్య పరిశీలనలో ఉంచిన వారిలో 112 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్​ వచ్చినట్లు వైద్య అధికారులు తెలిపారు. వీరంతా చైనా వుహాన్​ నుంచి వెనక్కు వచ్చిన వారే. ఈ నేపథ్యంలో వారిని నిర్భంధ కేంద్రం ​నుంచి పంపించనున్నట్లు పేర్కొన్నారు. వీరిలో 36 మంది విదేశీయులూ ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details