తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ బాధ్యతల నుంచి నన్ను తప్పించండి: సోనియా - సోనియా గాంధీ వార్తలు

కాంగ్రెస్​ పార్టీ సారథ్యంపై సీడబ్ల్యూసీ కీలక భేటీ కొనసాగుతోంది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతోన్న సోనియా గాంధీ.. తనను ఆ పదవి నుంచి తప్పుకునేందుకు అవకాశం కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది.

Give the chance to leave the Party presidency said Sonia Gandhi
అధ్యక్ష బాధ్యతల నుంచి నన్ను తప్పించండి: సోనియా

By

Published : Aug 24, 2020, 12:36 PM IST

Updated : Aug 24, 2020, 1:11 PM IST

కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంపై చర్చించేందుకు పార్టీ అత్యున్నత విధాన నిర్ణయ కమిటీ (సీడబ్ల్యూసీ) కీలక భేటీ కొనసాగుతోంది. నాయకత్వ సంక్షోభం నేపథ్యంలో.. పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఈ భేటీలో చర్చ జరుగుతోంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతోన్న ఈ భేటీలో మొత్తం 48మంది నేతలు పాల్గొన్నారు. వీరిలో 20మంది సీడబ్ల్యూసీ సభ్యులతోపాటు మరికొందరు ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. ఈ జాబితాలో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. తాజాగా రాజకీయ సంక్షోభం ఎదుర్కొన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల మాజీ బాధ్యులూ ఈ భేటీలో పాల్గొంటున్నారు.

పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఈ సమావేశంలో సోనియాగాంధీ కోరినట్లు సమాచారం. అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలని ఆమె సూచించారు. అయితే సోనియాగాంధీ అధ్యక్షురాలిగా యథావిధిగా కొనసాగాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారు.

ఇదీ చదవండి:'భారత రాజకీయాల్లో అరుణ్ జైట్లీకి సాటి లేరు!'

Last Updated : Aug 24, 2020, 1:11 PM IST

ABOUT THE AUTHOR

...view details