కొవిడ్-19తో దేశవ్యాప్తంగా పాఠశాలలు మూసివేసినందువల్ల విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకే పరిమితమయ్యారు. అయితే కేరళ ఇడుక్కి జిల్లా రాజమాలాకు చెందిన విద్యార్థులు సిగ్నల్ కోసం రోజూ ఆరు కిలోమీటర్లు నడుస్తున్నారు. ఎండా, వానల్ని సైతం లెక్కచేయకుండా రోడ్డునే పాఠశాలగా భావించి ఆన్లైన్ తరగతులు వింటున్నారు. వీళ్లంతా స్థానిక కాఫీ తోటల్లో పనిచేసేవారి పిల్లలు.
" సిగ్నల్ కోసం రోజూ 12 కిలోమీటర్లు నడక ప్రయాణం చేయటం కష్టంగా ఉంది. దారిలో ఎక్కడా విశ్రాంతి సదుపాయం లేదు. మూత్రశాలలు లేవు. మాకు ఇంటర్నెట్ సదుపాయం లేదంటే ఉపాధ్యాయులు నమ్మటం లేదు. దీంతో మేము సిగ్నల్ ఉన్న చోటుకు వెళ్లి ఆన్లైన్ క్లాసులు వింటున్నాం. సాయంత్రం ఐదు గంటలవరుకూ రోడ్డు పక్కనే కూర్చొని పాఠాలు నేర్చుకుంటున్నాం. ఇంటికి వెళ్లేసరికి రాత్రి అవుతుంది."
--ఓ విద్యార్థిని ఆవేదన