తెలంగాణ

telangana

జాలర్ల వలలో చిక్కిన 300 కిలోల అరుదైన చేప

By

Published : Dec 14, 2019, 4:19 PM IST

ఒడిశా కటక్​జిల్లాలో ఓ అరుదైన చేప జాలర్ల వలలో చిక్కింది. సుమారు 300 కిలోల వరకు బరువు ఉన్న ఈ చేపను చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు. స్టిన్​గ్రే (సంకుచ) చేపగా గుర్తించారు.

giant fish
జాలర్ల వలలో చిక్కిన 300 కిలోల అరుదైన చేప

జాలర్ల వలలో చిక్కిన 300 కిలోల అరుదైన చేప

చదునైన ఆకారంతో, చూడటానికి భారీ నల్లటి ఆల్చిప్పలా కనిపించే ఓ అరుదైన చేప ఒడిశా కటక్​జిల్లా నియాలి గ్రామంలో మత్య్సకారుల వలకి చిక్కింది. గ్రామంలోని కుందిముహా వంతెన సమీపంలో కొందరు జాలర్లు చేపల కోసం ఏర్పాటు చేసిన వలలో ఈ భారీ చేప చిక్కుకుంది.

బయటకి తీసిన జాలర్లు దానిని స్టిన్​గ్రే (శాస్త్రీయ నామం)గా గుర్తించారు. దీనిని స్థానికంగా సంకుచగా పిలుస్తారు. సుమారు 300 కిలోల వరకు బరువు ఉంటుందని తెలిపారు.

భారీ కాయంతో ఉన్న ఈ చేపను చూసేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చేప వద్ద సెల్ఫీలు దిగుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు.

ఇదీ చూడండి : '5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ' చెరిగిన స్వప్నమే!

ABOUT THE AUTHOR

...view details