తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీస్​ ఆర్కెస్ట్రా: లాక్​డౌన్​లో వినోదం హోమ్​ డెలివరీ - కరోనా న్యూస్​ అప్​డేట్​

దేశంలో విధించిన లాక్​డౌన్​ వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. చాలా మంది ఏం చెయ్యాలో తోచక ఒత్తిడికి లోనవుతున్నారు. అలాంటి వారికి కేరళ పోలీసులు స్వయంగా వినోదాన్ని పంచుతున్నారు. ఎవరికైనా ఇళ్లలో ఉండి కాలక్షేపం కాకపోతే.. పోలీసులు ఆర్కెస్ట్రాతో వచ్చి పాటలు పాడి అలరిస్తున్నారు.

Getting bored sitting at home? Kerala police will sing for people of Nelliyampathy
మీకు బోర్​ కొడితే మేమొచ్చి పాటలతో అలరిస్తాం: కేరళ పోలీసులు

By

Published : Apr 13, 2020, 1:20 PM IST

పాటతో అలరిస్తున్న కేరళ పోలీసులు

లాక్​డౌన్​ కారణంగా చాలా మంది ఇంట్లో ఏం చేయాలో తోచక తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. అలాంటి వారికోసం కేరళ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎవరికైనా ఇంట్లో కాలక్షేపం కాకపోతే.. పోలీసులే స్వయంగా ఆర్కెస్ట్రాతో వచ్చి పాటలతో అలరిస్తున్నారు.

పాలక్కడ్​ జిల్లాలోని కొండ ప్రాంతమైన నెల్లియంపత్తి గ్రామంలో ఎక్కువగా తోట పని చేసుకొనే కార్మికులు నివసిస్తున్నారు. ప్రస్తుతం లాక్​డౌన్​ వల్ల అక్కడి క్వార్టర్స్​లోనే వారంతా ఉంటున్నారు. ఇంట్లో నుంచి బయటకు రాలేకపోవడం వల్ల చాలా మందికి ఏం చేయాలో తోచక, ఒత్తిడికి గురవుతున్నారు.

గ్రామస్థులందరికీ లాక్​డౌన్ నుంచి కాస్త ఉపశమనం కలిగించేందుకు జనమైత్రి పోలీసులు ఆర్కెస్ట్రాతో వచ్చి పాటలను పాడి వినోదాన్ని పంచుకున్నారు. భక్తి గీతాలు, మప్పిలపట్టు, జానపద గేయాలు, సినిమా పాటలు ఇలా అన్ని రకాల సాంగ్స్​తో ప్రజల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు. ఈ కార్యక్రమాన్ని పదగిరి ఎస్​ఐ ఎం. హంస చేపట్టారు.

పాటలు పాడే పోలీసులు ఎవరికీ సంగీతంపై పట్టులేదు. స్మార్ట్​ఫోన్​లో బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ ప్లే అవుతుంటే... చిన్నపాటి మైకు సాయంతో వారు పాట పాడుతున్నారు. అయితే లాక్​డౌన్​ నిబంధనలను పాటిస్తున్న వారికే ఈ వినోదాన్ని పంచుతామని పోలీసులు తెలిపారు. ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details