తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైల్వే స్టేషన్​లో 'చిల్లర గ్యాంగ్' వార్​ - railway

దిల్లీలోని ఓ రైల్వేస్టేషన్​లో రెండు ముఠాల మధ్య ఘర్షణ కాసేపు భయానక వాతావరణం సృష్టించింది. ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించిన ఈ ముష్టియుద్ధం ఘటనపై ఆర్​పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసు దర్యాప్తు చేస్తున్నారు.

వైరల్​: రైల్వే స్టేషన్​లో 'చిల్లర గ్యాంగ్' వార్​

By

Published : Jul 14, 2019, 4:13 PM IST

రైల్వే స్టేషన్​లో 'చిల్లర గ్యాంగ్' వార్​

దేశ రాజధాని దిల్లీలో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. అందరూ చూస్తుండగానే ఓ బృందంపై ముష్టిఘాతాలు కురిపించింది మరో ముఠా. రైల్లో జరిగిన ఘర్షణ ఈ ముష్టియుద్ధానికి దారి తీసిందని తెలుస్తోంది.

ఘజియాబాద్ పరిధిలోని 'లోని రైల్వే స్టేషన్'​లో ఈ గొడవ జరుగుతుండగా చుట్టూ ఉన్నవారు భయంతో వణికిపోయారు. ముష్టిఘాతాల అనంతరం ఇరు బృందాలు ఏమీ తెలియదన్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయాయి.

వీడియో ఆధారంగా ఆర్​పీఎఫ్ పోలీసులను విలేకరులు ప్రశ్నించారు. పోలీసులు వీడియోను పరిశీలించి గుర్తుతెలియని ప్రయాణికులుగా నిర్ధరించారు. ఘటనపై కేసు నమోదుచేశారు. చిల్లర గ్యాంగ్​ ఆచూకీ కనిపెట్టేందుకు దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2: జాబిల్లితో ఓ మాట చెప్పాలని...

ABOUT THE AUTHOR

...view details