తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పర్యావరణహితం: మొక్కగా మారే బొజ్జ గణపయ్య

వినాయకచవితి రానేవచ్చింది. కనీసం ఈ సారైనా.. నిమ్మజ్జనం చేసే ఒక్కో విగ్రహం ఒక్కో మొక్కగా మారితే పర్యావరణానికి ఎంత మేలో! ఇది అసంభవం అనుకుంటున్నారా..? కానీ ఇది సంభవమేనని నిరూపించింది కర్ణాటకకు చెందిన కొంతమంది యువకుల బృందం. వీరు రూపొందించిన విగ్రహం... నిమజ్జనం అనంతరం మొక్కగా మారుతుంది.

పర్యావరణహితం: మొక్కగా మారే బొజ్జ గణపయ్య

By

Published : Aug 29, 2019, 7:25 PM IST

Updated : Sep 28, 2019, 6:45 PM IST

మొక్కగా మారే బొజ్జ గణపయ్య

వినాయక చవితి సందడి జోరందుకుంది. చవితినాడు దేశంలోని అనేక మంది గణేశుడిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. తర్వాత నీటిలో నిమ్మజ్జనం చేస్తారు. కానీ, చవితి సందర్భంగా ఏటా రసాయన రంగుల విగ్రహాలు పర్యావరణానికి కలిగించే హానీ అంతా ఇంతా కాదు.

కర్ణాటకలోని మంగళూరుకు చెందిన నితిన్​ వసు బృందం.. పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను రూపొందిస్తున్నారు. నిమజ్జనం అనంతరం మొక్కలా మారడమే ఈ విగ్రహాల ప్రత్యేకత. కాగితపు గుజ్జు, పలు వృక్షాల విత్తనాలు, కూరగాయలు, పళ్లను వీటి తయారీలో ఉపయోగించారు.

"పాత పత్రికలు, పుస్తకాల కాగితాలను దంచి ఓ గుజ్జులా తయారు చేశాం. ఆ గుజ్జును విగ్రహాల తయారీలో ఉపయోగించాం. ఒక్కో విగ్రహంలో ఒక్కో రకం విత్తనాలను కలిపాం. ఈ విగ్రహం నీటిలో కరిగిపోయాక మొక్కలా మారుతుంది." -నితిన్​ వసు.

గణేశుడి విగ్రహాల తరహాలోనే కాగితాలతో పెన్నులు, పెన్సిళ్లనూ రూపొందించింది ఈ బృందం.

ఇదీ చూడండి:- మహిళ పొట్టలో నుంచి బయటపడ్డ 1500 రాళ్లు

Last Updated : Sep 28, 2019, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details