తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూసివేతకు అడుగు దూరంలో 'గాంధీ పాఠశాలలు' - GANDHI

తమిళనాడులోని రెండు పాఠశాలలు మూతపడే స్థితిలో ఉన్నాయి. ఇది సాధారణ వార్తే అనిపించవచ్చు. కానీ ఈ బడులకు గొప్ప చరిత్రే ఉంది. మహాత్మా గాంధీ స్థాపించినవే ఈ పాఠశాలలు. బాపూ 150వ జయంతి వేడుకలకు దేశం ముస్తాబవుతున్న సందర్భంలో.. దీనస్థితిలో ఉన్న ఈ పాఠశాలలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

మూసివేతకు అడుగు దూరంలో 'గాంధీ పాఠశాలలు'

By

Published : Sep 22, 2019, 6:03 AM IST

Updated : Oct 1, 2019, 1:02 PM IST

మూసివేతకు అడుగు దూరంలో 'గాంధీ పాఠశాలలు'

మహాత్ముడి 150వ జన్మదిన వేడుకలను మరికొన్ని రోజుల్లో దేశం ఎంతో ఘనంగా జరుపుకోనుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఏడాది ముందు నుంచే భారీ స్థాయిలో ప్రణాళికలు రచించింది. కానీ గాంధీ జీవితానికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు చెరిగిపోయే ప్రమాదంలో పడ్డాయి. అవే తమిళనాడులోని రెండు పాఠశాలలు.

ఈ బడులను గాంధీ స్థాపించారు. హరిజన్​ సేవక్​ సంఘ్​ ఆధ్వర్యంలో వీటి కార్యకలాపాలు సాగుతున్నాయి. మూడేళ్లుగా కేంద్ర నిధులు అందక.. మూసివేతకు అడుగు దూరంలో ఉన్నాయి ఈ పాఠశాలలు.

మధురైలో ఎన్​ఎమ్​ఆర్​ సుబ్బరామన్​ మెమోరియల్​ రెసిడెన్షియల్​ ప్రాథమిక పాఠశాల, విల్లుపురమ్​లోని తిరుకోయ్​ళూర్​ రెసిడెన్షియల్​ మాధ్యమిక పాఠశాలను హరిజన్​ సేవక్​ సంఘ్​ నడుపుతోంది.

ప్రస్తుతం 400 మంది విద్యార్థులు ఈ రెండు పాఠశాలల్లో చదువుకుంటున్నారు. తక్షణమే నిధులు అందకుంటే ఇవి మూతపడే అవకాశముంది. ఇదే జరిగితే.. ఆ విద్యార్థులందరూ పుస్తకాలు వీడి.. బాల కార్మికుల అవతారం ఎత్తాల్సి వస్తుందని సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"అప్పటి కాంగ్రెస్​ నేత ఎన్​ఎమ్​ఆర్​ సుబ్బరామన్​.. ఈ(మధురై) పాఠశాల కోసం తన బంగ్లాను విరాళంగా ఇచ్చారు. మూడేళ్లుగా ఈ పాఠశాలకు అందాల్సిన నిధులను కేంద్రం విడుదల చేయట్లేదు. ఈ ప్రభావం.. ఇక్కడ చదువుకుంటున్న 125 విద్యార్థులపై పడుతోంది. మధురైలోని పాఠశాలకు తమిళనాడు ప్రభుత్వం సహాయం చేస్తోంది. తిరుకోయ్​ళూర్​లోని పాఠశాల మాత్రం పూర్తిగా కేంద్ర నిధులపైనే ఆధారపడుతోంది. ప్రస్తుతం ఆ బడి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. దేశవ్యాప్తంగా హెచ్​ఎస్​ఎస్ నిర్వహిస్తున్న అన్ని పాఠశాలలది ఇదే స్థితి. ఈ పరిస్థితిని విల్లుపురమ్​ ఎంపీ రవికుమార్ దృష్టికి తీసుకెళ్లాం. ఈ విషయంపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి థావర్​చంద్​ గెహ్లోత్​కు లేఖ రాశారు రవికుమార్​. మధురై పాఠశాలకు సంబంధించిన నిధులు(2016 నుంచి 2019వరకు) పెండింగ్​లో ఉన్నాయి."
--- ఆర్​. శ్రీనివాసన్​, తమిళనాడు హెచ్​ఎస్​ఎస్​ కార్యదర్శి

నిధుల సంక్షోభం వల్ల ఇప్పటికే కోల్​కతాలోని ఓ పాఠశాల మూతపడిందని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీనివాసన్​.

2017లో చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన వెంకయ్యనాయుడు.. తన ప్రసంగంలో ఈ పాఠశాలలను ప్రస్తావించారు. గాంధీ స్థాపించిన విద్యాసంస్థలతో అనుసంధానమవడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. 1932లో ఈ పాఠశాలల నియమాలు, నిబంధనలను స్వయంగా మాహాత్ముడే రాశారని గుర్తుచేశారు.

హరిజన్​ సేవక్​ సంఘ్​ సభ్యులు చేస్తున్న సేవపై ప్రశంసల వర్షం కురిపించారు వెంకయ్య నాయుడు. కార్పొరేట్​ సంస్థలు, దాతలు ముందడుగు వేసి పాఠశాలకు సహాయం చేయాలని ఆనాడు పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:-సెల్ఫీ కోసం స్తంభాలు కూల్చి జైలుకెళ్లాడు!

Last Updated : Oct 1, 2019, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details