దేశంలో కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోన్న తరుణంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రోజుకు 60 కిలోమీటర్ల వరకు రహదారుల నిర్మాణం చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
డెవలపర్స్ అసోసియేషన్ క్రెడై-ఎంసీహెచ్ఐ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన కేంద్ర మంత్రి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే మౌలిక వసతుల అభివృద్ధి జరగాలని అన్నారు.
"గతంలో రోజుకు 30కిలో మీటర్ల రహదారులు నిర్మాణం జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఆ లక్ష్యాన్ని విజయవతంగా చేరుకున్నాము. దీనిని ఇప్పుడు రోజుకు 60 కిలో మీటర్లకు పెంచాలని నిర్ణయించాం. ప్రస్తుతం జరుగుతున్న పనుల కంటే, రోడ్ల నిర్మాణ అభివృద్ధి పనుల 2-3 రెట్లు వేగంగా జరగాలి."