తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ నగరాల్లో మహిళల కోసం 'పింక్ బస్సులు'!

దేశంలోని ప్రధాన నగరాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా పింక్​ బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ. ప్రజా రవాణాలో మహిళల భద్రతకు సంబంధించి లోక్​సభలో విపక్షాలు అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ విషయాన్ని వెల్లడించారు.

pink-buses-for-women
మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ బస్సులు

By

Published : Mar 12, 2020, 4:05 PM IST

దేశంలో కోటి జనాభా దాటిన అన్ని నగరాల్లోనూ మహిళల కోసం పింక్​ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. మహిళల భద్రత అంశంపై లోక్​సభలో విపక్షాలు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని తెలిపారు.

పలు నగరాల్లో పింక్ బస్సులను ఇప్పటికే ప్రవేశపెట్టి విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. ఈ బస్సులలో డ్రైవర్, కండక్టర్ కూడా మహిళలే ఉంటారన్నారు. కొత్త బస్సుల కోసం సదరు తయారీ సంస్థలను సంప్రదించామని తెలిపారు.

సీసీ కెమెరాలు..

దిల్లీలో మహిళల ప్రయాణ భద్రతకు సంబధించిన ఇదే తరహా ప్రశ్నకు కూడా సమాధానం చెప్పారు గడ్కరీ. నూతన బస్సులలో సీసీ కెమెరాలతో పాటు, అత్యవసర బటన్​లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి: ఆ వాచ్​లు మాకు ఎప్పుడు ఇస్తారు: ఎంపీల ప్రశ్న

ABOUT THE AUTHOR

...view details